Sunday, January 19, 2025
Homeసినిమాచిరు, నాగ్ త‌గ్గేదెవ‌రు..?  గెలిచేదెవ‌రు..?

చిరు, నాగ్ త‌గ్గేదెవ‌రు..?  గెలిచేదెవ‌రు..?

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్. అయితే.. చిరంజీవి న‌టించిన ‘గాడ్ ఫాద‌ర్’, నాగార్జున న‌టించిన ‘ది ఘోస్ట్‘ సినిమాలను అక్టోబ‌ర్ 5న విడుదల చేస్తున్నట్లు ఆయా నిర్మాతలు ప్రకటించారు. దీంతో అభిమానుల్లోనూ, ఇండ‌స్ట్రీలోనూ వీరిద్ద‌రి మ‌ధ్య పోటీ  ఆస‌క్తిగా మారింది. అయితే అగ్ర హీరోలు చిత్రాలు ఒకే రోజు రిలీజ్  కావడం అన్నది కొంతకాలంగా  జరగడం లేదు. ఇది ఒక‌ప్ప‌టి మాట.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఒక‌ప్పుడు గట్టి పోటీ ఉండేది కాబట్టి..నువ్వా?  నేనా? అన్న రేంజ్ లో పోటీప‌డి సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇప్పుడంత సీన్ లేదు కాబ‌ట్టి బాక్సాఫీస్ లెక్కలు పరిగణలోకి తీసుకుని ఎవ‌రూ పోటీలో లేకుండా చూసుకుని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో చిరు, నాగ్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

దీంతో చిరంజీవి వెనక్కి తగ్గుతారా?  నాగార్జున ఆగిపోతారా?  చివ‌రికి త‌గ్గేదెవ‌రు..? గెలిచేదెవ‌రు..? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read : చిరంజీవికి బహిరంగ లేఖ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్