Saturday, November 23, 2024
HomeTrending Newsఅడ్ హాక్‌ నిధులతో పోలవరం పనులు: సిఎం సూచన

అడ్ హాక్‌ నిధులతో పోలవరం పనులు: సిఎం సూచన

పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేయడానికి కేంద్రం నుంచి అడ్ హాక్‌గా 6వేల కోట్ల రూపాయలు సాధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కాంపొనెంట్‌ వైజ్‌గా రీయింబర్స్‌ కాకుండా,  అడహాక్‌గా నిధులు తెచ్చుకుంటే కీలక పనులను త్వరితగతిన ముందుకు కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. వరద తగ్గగానే శరవేగంతో  పనులు చేపట్టడానికి ఈ నిధులు ఉపకరిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.2,900 కోట్లు కేంద్రం రీయింబర్స్‌ చేయాల్సి ఉందన్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జలవనరులశాఖపై  సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యతా ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు.

సమీక్ష సందర్భంగా సిఎం చేసిన వ్యాఖ్యలు- అధికారుల వివరణ

  • అడహాక్‌గా కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునే అంశంపై దృష్టిపెట్టాలి
  • ఈ మేరకు కేంద్రానికి లేఖలు కూడా రాయాలి
  • పోలవరం కుడి, ఎడమ కాల్వలకు సంబంధించి హెడ్‌ వర్క్స్, కనెక్టివిటీ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
  • పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై సిఎం సమగ్ర సమీక్ష
  • ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్‌–1, గ్యాప్‌–2లు పూడ్చే పనుల అంశంపై విస్తృత చర్చ.
  • షెడ్యూలు ప్రకారం జరుగుతున్న దిగువ కాఫర్‌డ్యాం పనులకు కూడా ముందస్తు వరదల కారణంగా అంతరాయం ఏర్పడిందని, వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగాని దిగువ కాఫర్‌ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఉంటుందన్న అధికారులు.
  • వరదలు పూర్తిగా తగ్గితే… ఆగస్టు మొదటివారంలో పనులు తిరిగి ప్రారంభిస్తామని అధికారుల వివరణ
  • ఈ పరిస్థితి రాగానే ముమ్మరంగా పనులు చేయడానికి అన్నిరకాలుగా సిద్ధంకావాలని సిఎం సూచన
  • ఆగస్టు మూడోవారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీల ప్రారంభోత్సవానికి సిద్ధంచేశామన్న అధికారులు.
  • బ్యారేజీపై పెట్టాల్సిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహం కోసం ఎదురుచూస్తున్నామని, అది కూడా త్వరలో చేరుకుంటుందని వివరణ
  • దసరా నాటికి అవుకు టన్నెల్‌–2 సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు.
  • వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ – 2పనులపైనా సీఎం ఆరా
  • ఏప్రిల్‌లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్‌లో 346.6 మీటర్లు, జులైలో ఇప్పటివరకూ 137.5 మీటర్ల పనులు చేశామన్న అధికారులు.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని ఆదేశం
  • వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 ఫేజ్‌–2 పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని, అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామన్న అధికారులు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్రతనయ, తారకరామతీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్, రాయలసీమలోని జొలదరాశి,రాజోలిబండ, కుందూ లిఫ్ట్, వేదవతి, ఆర్డీఎస్‌ ప్రాజెక్టులు, వీటితోపాటు చింతలపూడి, వైయస్సార్‌ పల్నాడు, మడకశిర బైపాస్‌ కెనాల్, బైరవానితిప్ప, వరికెశెలపూడి కలుపుకుని మొత్తం 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తిచేయడానికి లక్ష్యాలను నిర్దేశించిన సీఎం.

కర్నూలు పశ్చిమ ప్రాంతంపై సిఎం ప్రత్యేక సమీక్ష: ఈ సందర్భంగా జగన్ కీలక వ్యాఖ్యలు

  • దశాబ్దాల తరబడి పశ్చిమ కర్నూలు ప్రాంతం బాగా వెనకబడి ఉంది, దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది
  • నీటి వసతుల పరంగా, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతం ఇది
  • దశాబ్దాలుగా ఇక్కడ నుంచి కొనసాగుతున్న వలసలను నివారించడానికి కార్యాచరణ సిద్ధంచేయాలి
  • భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలి
  • ఈ ప్రాంతంలో ఇరిగేషన్, తాగునీటి పథకాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలి
  • దీనివల్ల ప్రజలకు వ్యాపకం దొరుకుతుంది, వలసలను నివారించగలుగుతాం
  • ఐటీఐ, పాలిటెట్నిక్, ఇంజినీరింగ్‌ కాలేజీలు తదితర విద్యాసంస్థల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధంచేయాలి
  • ఈ ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

ఈ సమీక్షా సమావేశంలో జలవనరులశాఖమంత్రి అంబటి రాంబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్