Saturday, January 18, 2025
Homeసినిమాసిఎం జగన్ గారికి నా కృతజ్ఞతలు: నారాయణ మూర్తి

సిఎం జగన్ గారికి నా కృతజ్ఞతలు: నారాయణ మూర్తి

వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు దక్కడంపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి సంతోషం వ్యక్తం చేశారు.  “డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ కళారంగంలో కళా తపస్వి కే విశ్వనాథ్ గారికి, నాకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను. గత 38 ఎనిమిదేళ్లుగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో కానీ మన భారత దేశంలో వుత్పన్నమవుతున్న సమస్యల పై స్పందించి ప్రజా సమస్యకు ఇటి వృత్తాలుగా సినిమాలు తీస్తూ వస్తున్నాను.

అర్ధరాత్రి స్వతంత్రం నుంచి నేటి యునివర్సిటీ వరకు చిత్రాల వల్ల ఆర్ నారాయణ మూర్తి అనే నేను ప్రజల హృదయాలలో చిరస్థాయిగా గా వున్నాను. ఆర్ నారాయణ మూర్తి ప్రజా కళాకారుడు, ఆర్ నారాయణ మూర్తి ప్రజా చిత్రాలు తీస్తాడు. ఆర్ నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్ అని ప్రజలు నన్ను అభిమనిస్తూ వున్నారు. నా పని నీ గుర్తించి గౌరవించి నాకు వైయస్సార్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి కి నా కృతజ్ఞతలు” అని తెలియచేశారు.

Also Read : విశ్వనాథ్, కృష్ణా-సుచిత్రా ఎల్లాలకు వైఎస్సార్ అవార్డులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్