దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మంగళవారం మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గమ్మవారికి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. దుర్గగుడికి చేరుకున్న ముఖ్యమంత్రికి వేదపండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సామినాయుడు, శాసన సభ్యులు మల్లాది విష్ణు, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఆలయ ఈఓ డి. భ్రమరాంబ. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారిని సాంప్రదాయ వస్త్రధారణతో సిఎం జగన్ దర్శించుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతరాలయంలో ఆలయ ప్రధానార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.