Sunday, January 19, 2025
HomeTrending Newsపీఆర్సీపై 72 గంటల్లో సిఎం నిర్ణయం: సిఎస్

పీఆర్సీపై 72 గంటల్లో సిఎం నిర్ణయం: సిఎస్

PRC submitted to CM:
పీఆర్సీ నివేదికపై 72 గంటల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ వెల్లడించారు. 11వ వేతన సంఘం సిఫార్సులపై కమిషన్ ఇచ్చిన నివేదికను సిఎంకు సిఎస్ అందజేశారు. రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

అనంతరం సిఎస్ డా. సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ పే కమిషన్ ఇచ్చినట్లుగానే తాము కూడా . ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను రికమెండ్ చేశామన్నారు. 23 లేదా 27 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కమిటీ సూచించిందని చెప్పారు. 23 శాతం ఇస్తే రూ. 11, 557 కోట్లు, 27 శాతం ఇస్తే 13, 422 కోట్ల రూపాయలు భారం ప్రభుత్వంపై పడుతున్దన్న్నారు. ఏడు ప్రతిపాదనలను సిఎం కు సూచించామని చెప్పారు. ప్రస్తుతం కంటే 9 నుంచి 10 కోట్ల రూపాయల అదనపు భారం అవుతుందన్నారు.  పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందిస్తామని, ఫైనాన్స్  వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తామని చెప్పారు.

సిఎస్ మీడియా సమావేశంలో ముఖ్యాంశాలు:

⦿ 2018–19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ. 52,513 కోట్లు అయితే 2020–21 నాటికి ఆ వ్యయం రూ. 67,340 కోట్లకు చేరుకుంది.
⦿ 2018 –19లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం(ఎస్‌ఓఆర్‌)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం అయితే
⦿ 2020–21 నాటికి అది 111 శాతానికి చేరుకుంది.
⦿ ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయం 2018–19లో 32 శాతం అయితే, 2020–21 నాటికి 36 శాతానికి పెరిగింది.
⦿ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం.
⦿ 2020–21లో తెలంగాణాలో ఇది కేవలం 21 శాతమే… ఛత్తీస్‌గఢ్‌లో 32; మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో 31; ఒడిశా 29; మధ్యప్రదేశ్‌ 28; హర్యానా 23 శాతం;
⦿ జులై 1, 2019 నుంచి 27శాతం ఐఆర్‌ను ఇచ్చింది
⦿ ఐ.ఆర్‌. రూపేణా ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ. 4,569.78 కోట్లు, మొత్తంగా రూ. 15.839.99 కోట్లు చెల్లింపు

Also Read : పది రోజుల్లో పీఆర్సీ: సిఎం జగన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్