Saturday, January 18, 2025
HomeTrending Newsమునుగోడులో తెరాసకు సిపిఐ మద్దతు

మునుగోడులో తెరాసకు సిపిఐ మద్దతు

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా వచ్చిందన్నారు. హైదరాబాద్లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి స్వార్దం కోసం పార్టీ మారారని చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. బీజేపీనీ ఓడించే శక్తి trs కె ఉందని, అందుకే తాము trs కి మద్దతు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఉప ఎన్నిక ప్రజలపై రుద్ద బడిందని, సిపిఐ మునుగోడులో నిలబడాలని అయితే బీజేపీని ఓడించే వారికి మద్దతు ఇవ్వాలి అనుకున్నామని చెప్పారు.

వచ్చే నెల సెప్టెంబర్ 4 నుండి సిపిఐ రాష్ట్ర మహాసభలు ఉన్నాయని, అందులో రాజకీయ పరిణామాలు, పార్టీ నిర్మాణం పై చర్చ చేస్తామని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు మునుగోడు బహిరంగ సభ కి మమ్మల్ని కెసిఆర్ ఆహ్వానించారని, ప్రగతిశీల శక్తుల ఏర్పాటుకు కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా trs..cpi..సీపీఎం కలిసి పని చేస్తామని చాడ వెంకట్ రెడ్డి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, పల్లా వెంకట్‌ రెడ్డి.. ముఖ్యమంత్రితో ప్రగతిభవన్‌లో 2 గంటలపాటు చర్చించారు. ఈ రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో టీఆర్ ఎస్ కు మద్దతివ్వాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిర్ణయించారు.

మునుగోడులో 1967 నుంచి ఇప్పటివరకు 12 సార్లు శాసనసభ ఎన్నికలు జరిగితే సీపీఐ అభ్యర్థి 5 సార్లు విజయం సాధించారు. 1985 నుంచి 1999 వరకు సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణరావు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు పల్లా వెంకటరెడ్డి సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2009 నుంచి 2014 వరకు ఉజ్జిని యాదగిరిరావు సీపీఐ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈనియోజకవర్గంలో 6 సార్లు కాంగ్రెస్, 5 సార్లు సీపీఐ పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా.. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కమ్యూనిస్టులకు ఈనియోజకవర్గంలో కొంతబలం ఉండటంటో ఉప ఎన్నిక జరిగితే కమ్యూనిస్టులు పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే గతంలోనూ ఉప ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులు టీఆర్ ఎస్ కు మద్దతుగా నిలిచిన సందర్భాలున్నాయి. ఈనేపథ్యంలో నేరుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి సీపీఐ నాయకులతో చర్చించడం ద్వారా.. వారి మద్దతు పొందగలిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్