Wednesday, September 25, 2024
Homeసినిమా'ఎఫ్ఐఆర్' ఫస్ట్ సింగిల్ ‘ప్రయాణం’ విడుదల

‘ఎఫ్ఐఆర్’ ఫస్ట్ సింగిల్ ‘ప్రయాణం’ విడుదల

FIR First Single: కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎఫ్ఐఆర్’ చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండ‌డంతో సినిమాపై అంచనాలు  మ‌రింత పెరిగాయి.

ఈ చిత్రానికి అశ్వంత్ సంగీతాన్ని అందిచారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ ‘ప్రయాణం’ అనే పాట విడుదలైంది. అద్భుతమైన బాణీకి అందమైన విజువల్స్ తోడైనట్టు కనిపిస్తోంది. రాకేందు మౌళి సాహిత్యం, అభయ్ జోధ్‌పుర్కర్ గానం అద్భుతంగా ఉంది. విష్ణు విశాల్, రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ హైలెట్ గా నిలిచింది.

సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో, భయంకరమైన ఐస్ఐస్‌ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా ఎలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి అనేది ఎఫ్ఐఆర్ మూల‌కథ. ఈ కథ చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు మరియు హైదరాబాద్ వంటి న‌గ‌రాల్లో జ‌రుగుతుంది. స్టార్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, మాల పార్వతి త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

Also Read : మ‌హేష్ బాబు, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్