Sunday, January 19, 2025
Homeసినిమా'బింబిసార 2' నుంచి డైరెక్టర్ తప్పుకున్నాడా..?

‘బింబిసార 2’ నుంచి డైరెక్టర్ తప్పుకున్నాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని సినిమా. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన బింబిసార చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ సాధించింది.  ఈ సినిమా ద్వారా మల్లిడి వశిష్ట్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ‘బింబిసార 2’ ఉంటుందని ప్రకటించారు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ అనే విభిన్న కథా చిత్రం చేయడం.. అది రిలీజ్ అవ్వడం జరిగింది కానీ.. బింబిసార 2 గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఎప్పుడు బింబిసార 2 ఉంటుంది..? అని ఆరా తీస్తే.. ఆసక్తికర విషయం తెలిసింది.

ఇంతకీ విషయం ఏంటంటే.. బింబిసార 2 చిత్రానికి మల్లిడి వశిష్ట్ డైరెక్టర్ కాదట. కొన్ని కారణాల వలన మల్లిడి వశిష్ట్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. కాకపోతే కథాచర్చల్లో పాల్గొనడం.. ఈ కథను తనే రాయడం వలన కథారచయితగా మల్లిడి వశిష్ట్ పేరు ఉంటుందట. కాకపోతే డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదని వార్తలు వస్తున్నాయి. అయితే.. రొమాంటిక్ మూవీతో డైరెక్టర్ అయిన అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే డైరెక్టర్ ఎవరు అనేది ప్రకటించనున్నారు.

సోషియో ఫాంటసీ మూవీగా రూపొందే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అయితే.. డిస్నీ హాట్ స్టార్ కూడా నిర్మాణ భాగస్వామిగా చేరనున్నారని సమాచారం. బింబిసార బ్లాక్ బస్టర్ సాధించడంతో బింబిసార 2 అంటే.. భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని టీమ్ చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్