Sunday, September 22, 2024
HomeసినిమాChiranjeevi: చిరు కోసం స్టోరీ రెడీ చేస్తున్న మరో డైరెక్టర్

Chiranjeevi: చిరు కోసం స్టోరీ రెడీ చేస్తున్న మరో డైరెక్టర్

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చారు. కెరీర్ లో ఇలా చేయడం ఫస్ట్ టైమ్ కావడం విశేషం. మొత్తానికి చిరు రూటు మార్చారు. ఒకప్పుడు చిరంజీవితో సినిమా చేయాలంటే.. నాలుగైదు హిట్ సినిమాలు చేసుండాలి. దర్శకత్వంలో మంచి అనుభవం ఉండాలి. మాస్ పల్స్ తెలిసినవాడై ఉండాలి. ఇలా అన్ని అర్హతలు ఉన్నవారికే చిరు ఛాన్స్ ఇచ్చేవారు. అందుకనే చిరు కెరీర్ లో ఇప్పటి వరకు చూసుకుంటే కొత్త దర్శకులతో సినిమాలు చేయలేదు.

ఇప్పుడు కొత్త దర్శకులతో కాకపోయినా.. ఒకటి రెండు సినిమాలు చేసుంటే చాలు సినిమా చేయడానికి రెడీ అంటున్నారు. ఏ కొత్త దర్శకుడు కథ చెబుతున్నా వింటున్నారు. ఇప్పటికే చిరుకు కథ చెప్పిన యంగ్ డైరెక్టర్స్ లిస్ట్ పెద్దదే ఉంది. వశిష్ట్ కథ చెప్పారు. నచ్చడంతో ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే కళ్యాణ్ కృష్ణ తో సినిమా చేయడానికి కూడా ఓకే చెప్పారు. రైటర్ బి.వి.ఎస్. రవి కథ చెప్పాడు. ఈ కథకు కూడా చిరు ఎస్ చెప్పారు. నక్కిన త్రినాథరావు కూడా చిరు కోసం కథ రెడీ చేస్తున్నారు.

తాజాగా మరో యంగ్ డైరెక్టర్ విజయ్ కనకమేడల కూడా చిరంజీవి కోసం స్టోరీ రెడీ చేస్తున్నారని తెలిసింది. నాంది సినిమాతో దర్శకుడు అయిన విజయ్ కనకమేడల తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు. రీసెంట్ గా ఉగ్రం సినిమాతో మరో సక్సెస్ సాధించాడు. ఇప్పుడు చిరు కోసం కథ రెడీ చేస్తుండడం విశేషం. అయితే.. తనని కొత్తగా ప్రజెంట్ చేస్తారని చిరు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తక్కువ కాల్షీట్స్ తో సినిమా చేయాలని.. దీనికి యంగ్ డైరెక్టర్స్ బెస్ట్ ఛాయిస్ అనే ఆలోచనలో ఉన్నారు. మరి.. చిరు ఇస్తున్న ఈ ఆఫర్ ని ఎంత మంది యంగ్ డైరెక్టర్స్ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్