Saturday, January 18, 2025
Homeసినిమాగీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ‌చైత‌న్య మూవీ..?

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగ‌చైత‌న్య మూవీ..?

Geetha Arts: మ‌జిలీ, వెంకీమామ‌, ల‌వ్ స్టోరీ, బంగార్రాజు.. ఇలా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తున్న అక్కినేని నాగ‌చైత‌న్య ఇటీవ‌ల థ్యాంక్యూ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు. దీంతో ఈసారి స‌క్సెస్ సాధించి కంబ్యాక్ ఇవ్వాల‌ని ఫిక్స్ అయ్యాడు. వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్ లో పెడుతున్నాడు. చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు చైత‌న్య‌. దీని తర్వాత పరశురాం పెట్లా దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. నిజానికి చైతూ – పరశురాం కాంబోలో సినిమా ఎప్పుడో రావాల్సింది. 14 రీల్స్ ప్లస్ లో ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేశారు. అయితే మహేష్ బాబు తో మూవీ చేసే అవకాశం రావడంతో దర్శకుడి ప్రాధాన్యత మారింది. సర్కారు వారి పాట సినిమా తర్వాత నాగచైతన్య తో సినిమా చేయబోతున్నట్లు పరశురామ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఇటీవ‌ల‌ పరశురాం చైతన్య కు ఫుల్ నేరేషన్ ఇచ్చారట. దీనికి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. ఇది లవ్ అండ్ యాక్షన్ జోనర్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య కు జోడీగా రష్మికని హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. మ‌రి.. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ మూవీని అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Also Read ఆలోచ‌న‌లో ప‌డ్డ నాగ‌చైత‌న్య‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్