Saturday, January 18, 2025
Homeసినిమాఎఫ్.ఎన్.సీ.సీ. అధ్యక్షుడిగా ఘట్టమనేని

ఎఫ్.ఎన్.సీ.సీ. అధ్యక్షుడిగా ఘట్టమనేని

ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్.సీ.సీ.) ఎన్నికల్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్యానల్ ఘన విజయం సాధించింది. అధ్యక్షుడిగా ఆదిశేగిరిరావు..కార్యదర్శిగా ముళ్ళపూడి మోహన్, ఉపాధ్యక్షుడిగా తుమ్మల రంగారావు ఎన్నికయ్యారు. అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, కెఎల్ నారాయణలు కలిసి ఘట్టమనేని ప్యానెల్ ను రంగంలోకి దించారు. వీరికి ప్రత్యర్థులుగా ప్యానెల్ ఏదీ పోటీలో లేకపోయినా వ్యక్తిగత స్థాయిలో అన్ని పదవులకు పోటీ చేశారు. యలమంచిలి సురేష్ కుమార్, ఆర్. సురేష్ వర్మ అధ్యక్ష పదవికి, బండ్ల గణేష్ ఉపాధ్యక్ష, కెఎస్ రామారావు కార్యదర్శి పదవులకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కార్యవర్గంలోని అన్ని పదవులు ఆదిశేషగిరరావు ప్యానల్ దక్కించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్