Sunday, January 19, 2025
Homeసినిమాగిరీషయ్యతో మరో మెగా హీరో మూవీ?

గిరీషయ్యతో మరో మెగా హీరో మూవీ?

మెగా హీరో వరుణ్ తేజ్ ఓ వైపు విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ చిత్రాల్లో న‌టించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవ‌ల ‘గని’తో ప్లాప్ అందుకున్న వరుణ్ ‘ఎఫ్ 3’ తో హిట్ సాధించాడు.  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తదుపరి సినిమా చేస్తున్నాడు.  ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ప్ర‌వీణ్ స‌త్తారు.. కింగ్ అక్కినేని నాగార్జునతో ‘ది ఘోస్ట్’ రోపొందించారు. అక్టోబ‌ర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుంది.  దీని తర్వాత వరుణ్ తేజ్ మూవీ షూటింగ్ మొదలవుతుంది.  ఇదిలా ఉంటే… వరుణ్ మరో కొత్త ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాడు. అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ తో గుర్తింపు తెచ్చుకున్న గిరీషయ్య ఇటీవల వ‌రుణ్ తేజ్ కు స్క్రిప్ట్ వినిపించాడట. దీనికి వ‌రుణ్‌ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీషయ్య తెరకెక్కించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత ఇదే బ్యానర్ లోనే దర్శకుడు గిరీషయ్య  వరుణ్ తేజ్ తో సినిమా చేస్తారని  తెలుస్తోంది.

Also Read :  త్వరలో కెమెరా వెనక్కి వైష్ణ‌వ్ తేజ్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్