Sunday, January 19, 2025
Homeసినిమాశీతాకాలంలో సందడి చేయనున్న 'గుర్తుందా శీతాకాలం'

శీతాకాలంలో సందడి చేయనున్న ‘గుర్తుందా శీతాకాలం’

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో ఫీల్ గుడ్ మూవీగా రాబోతున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. స‌త్యదేవ్, త‌మ‌న్నా, మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. చాలా మంది త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత, వెనక్కు తిరిగి చూసుకుంటే కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి.

ఇలాంటి సంఘ‌ట‌నలు ప్రేక్షకుల‌కి గుర్తు చేసే ఉద్దేశ్యంతో ఈ ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని రూపొందించారు. క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్నిదర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. ఇది వరకే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన కాలభైరవ ట్యూన్స్ కూడా మంచి ఫీల్ ను క్రియేట్ చేసాయి. దాదాపుగా అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఇప్పటి వరకు విడుదల కాకుండా వాయిదా పడుతూ వచ్చింది.

శీతాకాలం- మంచులో మనుషులు తడిసి ముద్దయ్యే కాలం, చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం, నా లైఫ్ లో శీతాకాలానికి ఇంకో పేరు ఉంది సీజన్ అఫ్ మ్యాజిక్ అని ఈ సినిమా ట్రైలర్ లో చెప్పినట్లు ఈ శీతాకాల సీజన్ లోనే ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం సీజన్ కి జస్టిఫికేషన్ గా శీతాకాలంలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రాన్ని నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌ పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబులు సంయుక్తంగా నిర్మించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్