Saturday, November 23, 2024
HomeTrending Newsప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ మేనిఫెస్టో -రేవంత్ రెడ్డి

ప్రజల ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ మేనిఫెస్టో -రేవంత్ రెడ్డి

కేసీఆర్ రాష్ట్రంలో సమస్యల తీవ్రతను పట్టించుకోకుండా ఆస్తులు కూడబెట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డారని మండిపడ్డారు. మరోవైపు సమస్యలను పక్కనబెట్టి మోడీ ఎన్నికల ప్రణాళికలో మునిగితేలుతున్నారని  విమర్శించారు. దేశ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైనా పట్టించుకోవడంలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట నుండి తిరిగి ప్రారంభించారు. తొలుత పాలంపేటలోని రామప్ప దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రామప్ప నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ రేవంత్ పాద‌యాత్ర కొన‌సాగుతుంది. కాంగ్రెస్ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి, అధికారంలోకి వ‌స్తే చేప‌ట్టే కార్య‌క్ర‌మాల గురించి వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.

సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షలను కాలరాసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాలంటే కేసీఆర్ను గద్దెదించాలని.. అందుకే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించేందుకే పాదయాత్ర చేపట్టామని వివరించారు.

హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఈ రోజు పాలంపేట మీదుగా భూపాల్ పల్లి నియోజకవర్గం బుద్ధారంకు చేరుకుంటుంది. మధ్యాహ్నం భోజన విరామ అనంతరం చాతరాజు పల్లి మీదుగా పాదయాత్ర ములుగుకు చేరుకుంటుంది.

Also Read : మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్