Saturday, January 18, 2025
Homeసినిమా వీర‌మ‌ల్లు రిలీజ్ డేట్ ఫిక్స్. మ‌రి.. క‌లిసొస్తుందా..?

 వీర‌మ‌ల్లు రిలీజ్ డేట్ ఫిక్స్. మ‌రి.. క‌లిసొస్తుందా..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేష‌న్లో ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు‘ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. 120 కోట్ల‌కు పైగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ.  ఈ మూవీ కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. క‌రోనాతో పాటు ప‌వ‌న్ రాజకీయాల్లో బిజీగా ఉండ‌డం కార‌ణంగా షూటింగ్ చాలా ఆల‌స్యం అయ్యింది.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్స్ మూడు సార్లు మార్చారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా ఉహాలకందని రేంజ్ లో గ్యాప్ తీసుకుంది. ఈ సమ్మర్ కాదు దసరా అన్నారు. కనీసం వచ్చే సంక్రాంతికి వ‌స్తుంది అనుకుంటే.. అది కూడా సెట్ అవ్వలేదు. ఇక ఫైనల్ గా ఈ సినిమా 2023 మార్చి 30వ తేదీన విడుదల కాబోతున్నట్లు ప్ర‌క‌టించారు. ఇక ఆ డేట్ పై అయితే అభిమానుల్లో ఒక బలమైన సెంటిమెంట్ కూడా కొనసాగుతోంది. ఆ రోజు వస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అని కూడా అంటున్నారు.

రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ కూడా అదే రోజు వచ్చింది. కాబట్టి ఈ సినిమా సెంటిమెంట్ పరంగా కచ్చితంగా సక్సెస్ అవుతుంద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు పూర్తయింది అనే విషయంలో అయితే ఎలాంటి క్లారిటీ లేదు. ఇక అప్ డేట్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ చాలా స్లోగా ఉంది. మ‌రి.. ఇక నుంచి వీర‌మ‌ల్లు స్పీడు పెంచుతాడేమో చూడాలి.

Also Read : ‘..వీర‌మ‌ల్లు’పై ప‌వ‌న్ అసంతృప్తి నిజ‌మేనా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్