Sunday, January 19, 2025
HomeTrending Newsప్రజల మద్దతు ఉంటే బౌన్సర్లు ఎందుకు: కొలుసు

ప్రజల మద్దతు ఉంటే బౌన్సర్లు ఎందుకు: కొలుసు

అమరావతి పాదయాత్ర పేరుతో చంద్రబాబు విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కొలుసు పార్ధసారథి ఆరోపించారు. రాజధాని ప్రాంతం చుట్టూ వంద కిలోమీటర్ల పరిధిని గ్రీన్ జోన్ గా ప్రకటించి అక్కడ ఎలాంటి వ్యాపారాలు మొదలు పెట్టకుండా, భూములు అమ్ముకోకుండా ఆంక్షలు పెట్టి జీవో జారీ చేసి, రైతుల నోట్లో మట్టికొట్టిన  విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అమరావతి రాజధానిపై చర్చకు సిద్ధపడాలని కొలుసు సవాల్ విసిరారు.

రాష్ట్రంలో ప్రజలు మండల, జిల్లా ఆఫీసులకు గానీ, రాష్ట్ర సచివాల యానికి గానీ వచ్చే పని లేకుండా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి అందరికీ అక్కడే అన్ని రకాల సేవలు అందించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని, కానీ టిడిపి నేతలు మాత్రం సామాన్య ప్రజలు తమ పనుల కోసం చీటికీ మాటికీ సచివాలయానికి రావాలని కోరుకుంటారని సారథి విమర్శించారు.

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ మొదటి స్థానంలో ఉందని, 40,800కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించిందని చెప్పారు. గతంలో బాబు పాలనలో లాగా అద్దె కోట్లు వేసుకొని వచ్చిన వారిని చూపిస్తూ 15, 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయంటూ అబద్ధాలు చెప్పడం సిఎం జగన్ కు చేతకాదన్నారు.

రాష్ట్రంలో అభివృద్దికి టిడిపి నేతలు అడ్డుతగులుతున్నారని, రాష్ట్ర ఇమేజ్ ను దెబ్బతీయడానికి అనుక్షణం ప్రయత్నిస్తున్నారని సారథి విమర్శించారు. పాదయాత్రకు నిజంగా ప్రజల మద్దతు ఉంటే బౌన్సర్లను పెట్టుకొని ఎందుకు వెళుతున్నారని కొలుసు ప్రశ్నించారు.

Also Read: బాబూ అసెంబ్లీకి రా: అంబటి విజ్ఞప్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్