ప్రపంచ ఆర్థిక వృద్ధి వచ్చే వార్షిక ఏడాది మరింత బలహీనంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ మంగళవారం వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచ వృద్ధి 2022లో 3.4 శాతం ఉండగా.. అది 2023 వార్షిక సంవత్సరంలో 2.9 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. ఇది 2024లో 3.1 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనంలో ఉందని.. పుంజుకునేందుకు సమయం పడుతుందని పేర్కొంది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ 2022లో 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.
అభివృద్ది చెందుతున్న దేశాలలో భారతదేశం ముందుందని.. 2024 ఆర్థిక సంవత్సరలో మళ్లీ 6.8 శాతానికి వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) అంచనా ప్రకారం.. “అక్టోబర్ ఔట్‌లుక్‌తో పోలిస్తే భారతదేశానికి సంబంధించి మా వృద్ధి అంచనాలు మారలేదు. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మేము 6.8 శాతం వృద్ధిని కలిగి ఉన్నాం.. ఇది మార్చి వరకు కొనసాగుతుంది. ఆపై ఆర్థిక సంవత్సరంలో 2023లో 6.1 శాతంగా కొంత మందగమనాన్ని మేము ఆశిస్తున్నాము. భారతదేశంలో వృద్ధి రేటు 2022లో 6.8 శాతం ఉండగా.. 2023లో 6.1 శాతానికి క్షీణిస్తుంది. 2024లో 6.8 శాతానికి చేరుకుంటుంది.. బాహ్య ప్రకంపనలు ఉన్నప్పటికీ స్థిరమైన వృద్ధి కొనసాగుతుంది..