మహిళల ఆసియ కప్ టి 20 టోర్నీలో ఇండియా ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన సెమీ ఫైనల్లో థాయ్ లాండ్ పై 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. షఫాలీ వర్మ, రోడ్రిగ్యూస్, హర్మన్ ప్రీత్ లు బ్యాటింగ్ లో రాణించారు. తర్వాత దీప్తి శర్మ చక్కని బౌలింగ్ తో రాణించడంతో థాయ్ లాండ్ 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇండియా విసిరిన 149 పరుగుల లక్ష్య ఛేదనలో థాయ్ మహిళలు 74 పరుగులే చేయగలిగారు.
షిల్హేట్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో థాయ్ లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా తొలి వికెట్ (స్మృతి మందానా 13) కు 38 పరుగులు చేసింది. షఫాలీ 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసి ఔటయ్యింది. రోడ్రిగ్యూస్-27; హర్మన్-36; చివర్లో పూజా వస్త్రాకర్-17 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. థాయ్ బౌలర్లు చివరి ఐదు ఓవర్లు పదునైన బంతులతో ఇండియా భారీ స్కోరు చేయకుండా నిలువరించగలిగారు.
థాయ్ బౌలర్లలో టిప్పోక్ మూడు; భూచాతమ్, ఫన్నిత మాయా, పుట్టవోంగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
థాయ్ ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. నట్టయా, చై వై చెరో 21 పరుగులు చేశారు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాట్స్ విమెన్ విఫలం కావడంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు చేయాగలిగింది.
దీప్తి శర్మ మూడు; రాజేశ్వరి గయక్వాడ్ రెండు; రేణుకా సింగ్, స్నేహ్ రానా, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.
షఫాలీ వర్మ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ఇండియా క్లీన్ స్వీప్- గోస్వామికి ఘన వీడ్కోలు