Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్Women’s T20I Tri-Series:  విండీస్ పై ఇండియా విజయం

Women’s T20I Tri-Series:  విండీస్ పై ఇండియా విజయం

మహిళల టి 20 ముక్కోణపు సిరీస్ లో వెస్టిండీస్ పై ఇండియా 56 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య సౌతాఫ్రికాపై  ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే.   నేటి మ్యాచ్ లో స్మృతి మందానా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ లో సత్తా చాటారు.

ఈస్ట్ లండన్ లోని బఫెలో పార్క్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్కోరు 33 వద్ద యస్తికా భాటియా (18) ఔటయ్యింది, హర్లీన్ డియోల్ (12)కూడా త్వరగా పెవిలియన్ చేరింది.  ఈ దశలో కెప్టెన్, వైస్ కెప్టెన్ లు కలిసి మూడో వికెట్ కు అజేయంగా 115 జోడించారు. స్మృతి 51బంతుల్లో 10ఫోర్లు, 1 సిక్సర్ తో 74;  హర్మన్ 35 బంతుల్లో 8 ఫోర్లతో 51 పరుగులు చేశారు.

విండీస్ బౌలర్లలో షనికా బ్రూస్, రంహరక్ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత విండీస్ మహిళలు 25 పరుగులకే మూడు కీలక వికెట్లు ( రాషడ విలియమ్స్-8; బ్రింటీ కూపర్ డకౌట్; షబిక గజ్ఞాబి-3) కోల్పోయారు. షమైన్ కాంప్బెల్లె -47; కెప్టెన్ హేలీ మాథ్యూస్-34 (నాటౌట్) పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇండియా బౌలర్లలో  దీప్తి శర్మ 2, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్  చెరో వికెట్ పడగొట్టారు.

స్మృతి మందానా కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్