Friday, April 26, 2024
Homeస్పోర్ట్స్India (W)- England(W) : ఇండియా క్లీన్ స్వీప్- గోస్వామికి ఘన వీడ్కోలు

India (W)- England(W) : ఇండియా క్లీన్ స్వీప్- గోస్వామికి ఘన వీడ్కోలు

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న వన్డే సిరీస్ ను ఇండియా మహిళా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. నేటితో సుదీర్ఘ కెరీర్ కు గుడ్ బై చెబుతున్న పేస్ బౌలర్ జులన్ గోస్వామికి ఈ సంపూర్ణ విజయంతో ఘనమైన వీడ్కోలు పలికింది.  బ్యాటింగ్ లో విఫలమైన భారత జట్టు బౌలింగ్ లో రాణించి సత్తా చాటింది. 169 పరుగుల స్కోరును కాపాడుకొని అద్వితీయమైన విజయం సొంతం చేసుకుంది.

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి  మొత్తం ఐదుగురు డకౌట్ అయ్యారు (షఫాలీ వర్మ, యస్తికా భాటియా, జులన్ గోస్వామి, రేణుకా సింగ్, గాయక్వాడ్)… మరో ముగ్గురు సింగల్ డిజిట్ కే వెనుదిరిగారు (హర్మన్ ప్రీత్ కౌర్-4; హర్లీన్ డియోల్-2; దయాలన్ హేమలత-2). ఆల్ రౌండర్ దీప్తి శర్మ 68 పరుగులు చేసి హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచింది. ఓపెనర్ స్మృతి మందానా(50) అర్ధ సెంచరీ తో మరోసారి జట్టును ఆదుకుంది. పూజా వస్త్రాకర్ 22 పరుగులు చేసి ఔటయ్యింది.

ఇంగ్లాండ్ బౌలర్లలో కాటే క్రాస్ నాలుగు; ఫ్రేయా కెంప్, ఎక్సెల్ స్టోన్ చెరో రెండు; ఫ్రేయా డేవిస్, చార్లోట్టే డీన్ చెరో వికెట్ పడగొట్టారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా వెంట వెంట వికెట్లు కోల్పోయింది. 53 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్ లో ఎమ్మా లాంబ్ 21 పరుగులు చేసింది. టామీ బ్యూమౌంట్-8; సోఫియా డంక్లీ-7; ఆలీస్ క్యాప్సీ-5; డానిఎల్లె వ్యాట్-8; సోఫీ ఎక్సెల్ స్టోన్-0; ఫ్రేయా కెంప్-5 విఫలమయ్యారు. కెప్టెన్ అమీ జోన్స్ 28; కాటే క్రాస్ ­-10 పరుగులు చేశారు. చార్లోట్టె డీన్ ఒంటరి పోరాటం (47) చేసింది.అయితే దీప్తి శర్మ వేసిన 44వ ఓవరలో బాల్ వేయక ముందే క్రీజు దాటి వెళ్ళగా దీప్తి వికెట్లను పడగొట్టి రనౌట్ చేసింది. దీనితో 153 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఇండియా 16 పరుగులతో విజయం దక్కించుకుంది.

రేణుకా సింగ్ మరోసారి నాలుగు వికెట్లతో సత్తా చాటింది. జులన్ గోస్వామీ, రాజేశ్వరి చెరో రెండు ; దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

మ్యాచ్ అనంతరం ఇండియా ప్లేయర్స్ గోస్వామిని భుజాలపై ఎత్తుకొని పెవిలియన్ వరకూ మోసుకెల్లి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రేణుక సింగ్ ఠాకూర్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్…. హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ లభించాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్