సిఎంకు రాజ్యంగంపై నమ్మకం లేదు: కనకమేడల

కోర్టులపై జగన్ ప్రభుత్వానికి నమ్మకం లేదని, కోర్టు ధిక్కారమే ఆయుధంగా  పాలన సాగుతోందని టిడిపి నేత, రాజ్య సభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడాన్ని అయన తప్పు బట్టారు. రాజ్యంగం, కోర్టులపై ఈ ప్రభుత్వానికి విశ్వాసం లేదని వ్యాఖ్యానించారు. ఏపీ విభజన చట్టం ప్రకారమే అమరావతిని రాజధానిగా నిర్ణయించారని, దీనిపై చట్ట సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాత్రమే హైకోర్టు చెప్పిందని అయన గుర్తు చేశారు. బాపట్ల జిల్లాలో సాగుతోన్న అమరావతి-అరసవిల్లి  మహా పాదయాత్రలో పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, అనగాని సత్య ప్రసాద్, దేవినేని ఉమాలతో కలిసి కనకమేడల పాల్గొన్నారు.

ఏపీ  హైకోర్టు  గతంలో తీర్పు ఇచ్చినప్పుడు  అమలుకు సమయం కావాలని ప్రభుత్వం కోరిందని, కానీ ఆరు నెలల తర్వాత  ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్ళడం విద్దోరంగా ఉందన్నారు.  అప్పుడే తాము ఈ విషయమై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సిఎం జగన్ ప్రవర్తిస్తున్నారని, అసెంబ్లీ వేదికగా అయన ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టారని కనకమేడల ఆరోపించారు.

దొడ్డిదారిలో ఏపీ ప్రభుతం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ న్నారు. చట్టం, న్యాయపరంగా రైతుల పోరాటంలో వాస్తవమిందని, సుప్రీం లో కూడా రైతులకు అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమరావతి కొందరిది కాదు, అందరిదీ అని కేశవ్ అభివర్ణించారు.

Also Read: అఫిడవిట్ అసంబద్ధం: కనకమేడల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *