Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ కు జతగా జాన్వీ ఫిక్స్!

ఎన్టీఆర్ కు జతగా జాన్వీ ఫిక్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై కొన్నాళ్ళు  ఎలాంటి సమాచారం లేనప్సైపటికీ ఇటీవలి కాలంలో రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వస్తోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉందని తెలియచేస్తూ.. గతంలో కొన్ని ఫోటోలు రిలీజ్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీ ఆఫీస్ స్టార్ట్ చేశారు. దీంతో సినిమాపై కదలికి వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అని కొన్ని నెలలుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీస్ కైరా అద్వానీ, ఆలియా భట్, జాన్వీ కపూర్.. ఇలా కొంత మంది తారల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. ఇటీవల మిలి సినిమా ప్రమోషన్స్ కి జాన్వీ కపూర్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పింది జాన్వీ. అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా అని మేకర్స్ కూడా జాన్వీ కపూర్ నే సినిమాకు హీరోయిన్ గా ఫైనల్ చేశారని తెలిసింది. జాన్వీ కూడా ఓకే చెప్పిందని సమాచారం.

తారక్ తో తెలుగులో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఖచ్చితంగా ఇక్కడ కూడా అదరగొడుతుందని చెప్పొచ్చు. శ్రీదేవి తెలుగులో నటించి ఆతర్వాత బాలీవుడ్ వెళ్లింది. జాన్వీ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేసి టాలీవుడ్ కి వస్తుంది. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. మరి.. ఎన్టీఆర్ ఈ మూవీతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్