Karan-Prabhas; పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ ప్రాజెక్ట్ కె. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్నిఅత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దాదాపు 500 కోట్లతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంటే.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే… ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో బాలీవుడ్ బడా ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఓ బాలీవుడ్ మూవీ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే… అంత కంటే ముందుగా ప్రాజెక్ట్ కె లో పార్టనర్ గా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం డిష్కసన్స్ జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ టాలీవుడ్ పై బాగా ఫోకస్ పెట్టారు. విజయ్, పూరి కాంబినేషన్లో లైగర్ మూవీ నిర్మిస్తున్నారు. మరికొన్ని టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో కరణ్ పార్టనర్ కాబోతున్నారని సమాచారం.
Also Read : ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన అశ్వనీదత్