Sunday, January 19, 2025
Homeసినిమా'వాల్తేరు వీరయ్య'లో మరో స్పెషల్ రోల్?

‘వాల్తేరు వీరయ్య’లో మరో స్పెషల్ రోల్?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెట్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఇందులో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో అన్నయ్య సినిమాలో చిరు, రవితేజ కలిసి నటించారు. ఇప్పుడు మళ్లీ కలిసి సినిమా చేస్తుండడంతో వాల్తేరు వీరయ్య సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ యస్ఐ పాత్ర ఎంట్రీ ఇస్తోందని.. ఈ పాత్ర నిడివి తక్కువ అయినా సినిమాలో కీలకం అని, విలన్ చేతిలో హత్య కాబడే ఎమోషనల్ పాత్ర ఇది అని తెలిసింది. ఇప్పుడు ఈ పాత్రలో యంగ్ హీరో కార్తికేయ కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రవితేజ పాత్ర ఈ సినిమాలో రివీల్ అవుతుందట. ఇక రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

చిరంజీవి లుక్ ను చూస్తుంటే.. ముఠామేస్త్రీ, రౌడీ అల్లుడు సినిమాల్లో చిరంజీవిని చూసినట్టు ఉండడం.. ఇందులో క్యారెక్టర్ ఊర మాస్ గా ఉండడంతో వాల్తేరు వీరయ్య సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఆచార్య డిజాస్టర్ అయ్యింది. గాడ్ ఫాదర్ ఫరవాలేదు అనిపించుకుంది. దీంతో వాల్తేరు వీరయ్యతో సక్సెస్ సాధించడం ఖాయమని అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్