Sunday, January 19, 2025
Homeసినిమాచైతు వెబ్ సిరీస్ లో మలయాళ భామలు

చైతు వెబ్ సిరీస్ లో మలయాళ భామలు

Dootha: యువ సామ్రాట్ నాగచైత‌న్య మ‌జిలీ, వెంకీమామ‌, బంగార్రాజు.. ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌స్ట‌ర్స్ సాధించి కెరీర్ లో దూసుకెళుతున్నాడు.  నాగ‌చైత‌న్య‌ త‌దుప‌రి చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. స‌మ్మ‌ర్ లో థ్యాంక్యూ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్లోనే నాగ‌చైత‌న్య దూత అనే థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసిన ఈ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ సిరీస్ లో మల‌యాళ టాలెంటెడ్ యాక్ట్రెస్ ప్రియాభవాని శంకర్, పార్వతిలు న‌టిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌, విక్ర‌మ్ కుమార్, ప్రియాభ‌వాని శంక‌ర్, పార్వ‌తి క‌లిసి ఉన్న ఫోటోను రిలీజ్ చేశారు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అయితే.. ఈ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంద‌నేది తెలియాల్సివుంది.

Also Read : చైత‌న్య వెబ్ సిరీస్ టైటిల్ ‘దూత‌’?

RELATED ARTICLES

Most Popular

న్యూస్