Monday, February 24, 2025
Homeసినిమాకేజీఎఫ్ 2 సంచ‌ల‌నం

కేజీఎఫ్ 2 సంచ‌ల‌నం

KGF-2: క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో రూపొందిన కేజీఎఫ్ ఎంత‌టి విజ‌యం సాధించిందో తెలిసిందే. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 రూపొందింది. ఈ సినిమా పై ఫ‌స్ట్ నుంచి భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ట్రైల‌ర్ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో సంచ‌ల‌నం సృష్టించ‌డంతో కేజీఎఫ్ 2 మూవీ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డ్ క్రియేట్ చేస్తోంద‌నే టాక్ ఏర్ప‌డింది. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ది వేలకు పైగా థియేట‌ర్లో రిలీజైంది.

క‌న్న‌డ సినిమా ప‌ది వేల‌కు పైగా థియేట‌ర్లో రిలీజ్ కావ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఇక కన్న‌డ‌లోనే కాకుండా సౌత్ లో మిగిలిన రాష్ట్రాల్లోనూ అలాగే బాలీవుడ్ లోనూ రికార్డ్ ఓపెనింగ్స్ రాబ‌ట్టి చ‌రిత్ర సృష్టించింది. బాలీవుడ్ లో దాదాపుగా 40 కోట్లు ఫ‌స్ట్ డే క‌లెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ సినిమాల్లో ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ లో ఇదే రికార్డ్. దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. కేజీఎఫ్ 2 పై ఎంత క్రేజ్ ఉందో. ఫ‌స్డ్ డే ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. ఇక ఫుల్ ర‌న్ లో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

Also Read : ‘కేజీఎఫ్ 2’ ‘అధీర’ పాత్ర అదిరిందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్