Saturday, January 18, 2025
Homeసినిమాఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ లో ‘కేజీఎఫ్-2 స‌రికొత్త రికార్డ్

ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ లో ‘కేజీఎఫ్-2 స‌రికొత్త రికార్డ్

KGF-2 Records:  క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్, సెన్సేష‌న‌ల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ‘కేజీఎఫ్ 2’. ఈ మూవీ ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే కేజీఎఫ్ 2 ఫ‌స్ట్ డే నుంచే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకుని రికార్డు క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతోంది. ఇక‌ కేజీఎఫ్ 2 ఫ‌స్డ్ డే క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్ లో ఫ‌స్డ్ డే 53 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 19.5 కోట్లు రాబ‌ట్టింద‌ని స‌మాచారం. డ‌బ్బింగ్ సినిమా ఫ‌స్ట్ డే ఇంత క‌లెక్ట్ చేయ‌డం అనేది టాలీవుడ్ లో ఇదే ఫ‌స్ట్ టైమ్. క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌లో క‌లిపి దాదాపుగా 50 కోట్లు క‌లెక్ట్ చేసింద‌ట‌. ఓవ‌రాల్ గా కేజీఎఫ్ 2 ఫ‌స్ట్ డే ఇండియా గ్రాస్ 134.5 కోట్లు క‌లెక్ట్ చేసింది. మేక‌ర్స్ అఫిషియ‌ల్ గా ఈ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ అనౌన్స్ చేసి పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం జ‌రిగింది. మొత్తానికి రాకీ భాయ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ ల సునామీతో దూసుకెళుతున్నాడు. మ‌రి.. ఫుల్ ర‌న్ లో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

Also Read :‘కేజీఎఫ్ 2’ ‘అధీర’ పాత్ర అదిరిందా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్