Sunday, April 14, 2024
Homeతెలంగాణథర్డ్ వేవ్ పై ఆందోళన వద్దు : కిషన్ రెడ్డి

థర్డ్ వేవ్ పై ఆందోళన వద్దు : కిషన్ రెడ్డి

కరోనా మూడోదశపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ధర్డ్ వేవ్ తో సంబంధం లేకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంలో కేంద్రమంత్రి విస్తృతంగా పర్యటించారు. వ్యాక్సిన్ కేద్రాలను పరిశీలించారు, పలుచోట్ల కరోనా బాధితులకు, లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా నియంత్రణలోకి రావాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని, దీని వల్ల పేదలు ఇబ్బంది పడకూడ దనే రేషన్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 82.43 లక్షల డోసులు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం 4.5 లక్షల డోసులు మాత్రమే కొనుగోలు చేసిందని చెప్పారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ కు త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మనదేశంలో తయారైన వ్యాక్సిన్ వేయించుకున్నవారు విదేశాలకు వెళ్ళడంలో ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. కోవాక్సిన్ కోసం 1500 కోట్ల రుపాయల నిధులతో పాటు ముడి సరుకులను కూడా కేంద్రం అందించిందని చెప్పారు.

బయోలాజికల్ ఇవాన్స్ కంపెనీకి 30 కోట్ల డోసులు తయారు చేసేందుకు కేంద్రం సహకరిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. డిసెంబర్ నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ సింగల్ డోస్ వ్యాక్సిన్ కూడా 20 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతాయని, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా 8 కేంద్రాల్లో తయారుచేస్తున్నారని, డిసెంబర్ లోగా అన్ని వ్యాక్సిన్లు కలిపి 250 కోట్ల డోసుల తయారీకి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్