Sunday, September 8, 2024
HomeTrending Newsమోడీ డొల్ల హామీలు - కేటిఆర్ విమర్శ

మోడీ డొల్ల హామీలు – కేటిఆర్ విమర్శ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం పై మంత్రి కేటీఆర్ పదునైన విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా మోడీ నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్దేశించించుకున్న లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ది ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎర్రకోట నుంచి నిన్న ప్రసంగించిన మోడీ 2047 సంవత్సరం నాటికి సాధించాల్సిన కొత్త లక్ష్యాలపై మాట్లాడారు. వినడానికి అవి ఎంతో బాగున్నాయన్న కేటీఆర్, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేరలేదన్న సంగతిని మోడీ ఇప్పటికైనా గుర్తించాలని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా సూచించారు.

2022 నాటికి దేశ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2014 లో చేసిన వాగ్ధానం
2022 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు, కరెంటు , టాయిలెట్ కల్పిస్తామని 2014 లో ఇచ్చిన హామి
2022 మన దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లుగా మారుస్తానని 2018 లో చేసిన వాగ్ధానం
2022 నాటికి ప్రతీ ఒక్క భారతీయుడికి సొంత ఇళ్లు కట్టిస్తామని 2018 లో ఇచ్చిన హామి

వీటిలో ఏ ఒక్క వాగ్ధానాన్ని ఆయన నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. లక్ష్యసాధనలో ఎదురైన వైఫల్యాన్ని ఒప్పుకోకుండా కొత్త వాటి గురించి చెపితే విశ్వసనీయత ఏముంటుందన్నారు కేటీఆర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్