Sunday, January 19, 2025
Homeసినిమా'లైగర్' ఫుల్ మాస్ మూవీ ..  పగిలిపోద్ది: అనన్య పాండే 

‘లైగర్’ ఫుల్ మాస్ మూవీ ..  పగిలిపోద్ది: అనన్య పాండే 

టాలీవుడ్ కి బాలీవుడ్ భామలు పరిచయం కావడమనేది చాలా కాలంగా జరుగుతూ వస్తున్నదే. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండటంతో, బాలీవుడ్ భామలు తెలుగు సినిమాలు చేయడానికి మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. అలా టాలీవుడ్ తెరపైకి వస్తున్న బ్యూటీల జాబితాలో ‘అనన్య పాండే’ కూడా చేరిపోయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో .. విజయ్ దేవరకొండ జోడీగా ఆమె చేసిన ‘లైగర్’ ఈ నెల 25వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ లో జరిగిన ఈవెంట్ లో అనన్య  తెలుగులో మాట్లాడి ఆశ్చర్య పరిచింది.

“నా పేరు అనన్య పాండే .. అందరికీ నమస్కారం. తెలుగు సినిమా ఆడియన్స్ నాకు చాలా చాలా ఇష్టం. ఇలా తెలుగు ఫిల్మ్ ఫ్యామిలీని కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఇక్కడ ‘లైగర్’తో నా జర్నీ మొదలుకావడం మరింత ఆనందాన్ని కలిగించే విషయం. నా లైఫ్ లో నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకునే రోజు ఇది. పూరి .. చార్మీ .. మైక్ టైసన్ .. రమ్యకృష్ణగారు .. నా బుజ్జికన్నా విజయ్ దేవరకొండతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఆగస్టు 25వ తేదీన వస్తున్న ఈ సినిమా ఫుల్ ర్యాంప్ .. ఫుల్ మాస్ కమర్షియల్ సినిమాను దింపుతున్నాం .. పగిలిపోద్ది” అంటూ ఆడియన్స్ లో హుషారు పెంచింది.

“ఇంకా నీకు ఏమేం నేర్పించారమ్మా .. ఎవరమ్మా తెలుగులో మీ గురువుగారు?” అంటూ సుమ అడగడంతో, విజయ్ దేవరకొండ భుజంపై అనన్య చేయి వేస్తూ ‘నా బుజ్జీ కన్నా’ అని చెప్పడంతో ఆడియన్స్ ఘొల్లున నవ్వేశారు. ఆ సమయంలో విజయ్ దేవరకొండకి ఏం చేయాలో అర్థంకాక ఆయన కూడా నవ్వుతూ ఉండిపోయాడు. “మంచి గురువుగారు దొరికారమ్మా నీకు .. ఇంకో గురువుగారు కావాలంటే ఆలీగారు ఇక్కడే ఉన్నారు” అంటూ సుమ మరిన్ని నవ్వులు పూయించింది. ఇలా నిన్న వరంగల్ ఈవెంట్ మంచి సందడిగా కొనసాగింది

Also Read : లైగ‌ర్ సెన్సార్ టాక్ ఏంటి..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్