హైదరాబాద్ ప్రగతి భవన్ లో గురువారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ వ్యవహారం సోషల్ మీడియా లో రచ్చ అవుతోంది. సిఎం కెసిఆర్ దళిత మంత్రిని అవమానపరిచారని… దానికి సంబంధించిన వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. దీనిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రోజు హైదరాబాద్ లో వివరణ ఇచ్చారు. తండ్రి హోదాలో మంత్రులను ఒక వైపు ఎమ్మెల్యేలను ఓ వైపు కూర్చోవాలని చెప్పారని మంత్రి వెల్లడించారు. అయితే ఎమ్మెల్యేల వరుసలో ఉన్న నన్ను మంత్రుల వైపు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారని స్పష్టం చేశారు. ఈ విషయంపై బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు మంత్రిని, దళిత సమాజానికి అవమానం జరిగిందని చిత్రీకరిస్తున్నారు కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకులు ఇలాంటివి మానుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ రోజు హితవు పలికారు.
పార్టీ అనేది ఒక కుటుంబం… ఇందులో ముఖ్యమంత్రి కెసీఆర్ కుటుంబానికి తండ్రి లాంటి వారు కుటుంబ సభ్యులను సంభోదించినట్టు గానే సంభోదించారు ఆ పక్కన సహచర మంత్రి హరీష్ రావు నా కోసం పక్కకు జరిగి నాకు కుర్చీ ఇచ్చారు ఇది కూడా గమనించాలి ప్రతిపక్షాలు అన్నారు. అనవసరమైన విషయాలు జరిగిన సంఘటనలు పూర్తిగా తెలుసుకోకుండా ఎవరికి వారు… వారికి అనుకూలంగా ఉహించుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. బురద చల్లే రాజకీయం మానుకోవాలన్నారు. లేదంటే అసత్య ఆరోపణలు చేస్తున్న వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటదని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.