Thursday, May 30, 2024
HomeTrending Newsజిల్లాకు ఏం చేశారు?: కిరణ్ పై మిథున్ రెడ్డి ఫైర్

జిల్లాకు ఏం చేశారు?: కిరణ్ పై మిథున్ రెడ్డి ఫైర్

ఆస్తులను కాపాడుకునేందుకే కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన్ను ప్రజలే హైదరాబాద్ కు తరిమేస్తారని రాజంపేట వైసీపీ ఎంపి అభ్యర్ధి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హెచ్చరించారు. తాము ఎప్పుడూ లిక్కర్, వడ్డీ వ్యాపారాలు చేయలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత పదేళ్ళు ఊరు వదిలిన కిరణ్  విశ్వాసం అనే పదానికి విలువ తెలియని వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నుంచి చెప్పుల పార్టీకి వెళ్ళారని, కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు బిజెపి పంచన చేరి ఎంపిగా పోటీ చేస్తున్నారని విమర్శించారు.

ముఖ్యమంత్రిగా తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కిరణ్ కుమార్ రెడ్డి ప్రమాణం చేయగలరా అంటూ మిథున్ రెడ్డి సవాల్ చేశారు. మూడున్నరేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తీ పుంగనూరుకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజంపేట లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఎంపి సీటును కూడా భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్