Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ బ‌ర్త్ డే.. మూడు స‌ర్ ఫ్రైజ్ లు...

ఎన్టీఆర్ బ‌ర్త్ డే.. మూడు స‌ర్ ఫ్రైజ్ లు…

Surprises to Fans:  యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20. ఆ రోజు అభిమానుల‌కు పండ‌గ రోజు. ఈ సంవ‌త్స‌రం ఎన్టీఆర్ పుట్టిన‌రోజు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పటికే ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేసిన‌ రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇవ్వబోతున్నారని వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్ 30 కి సంబంధించిన అప్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా వ‌చ్చి నెల రోజులు దాటినా ఇంకా ఎన్టీఆర్ 30 సినిమా ఎప్పుడు మొదలు అయ్యేది క్లారిటీ ఇవ్వడం లేదు. ఆచార్య సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ 30 సినిమా మరికాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎన్టీఆర్ 31 సినిమా కూడా ఇప్పటికే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ 31 సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినా కూడా ఇప్పుడే సినిమా నుండి ఎన్టీఆర్ లుక్ ను రివీల్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ రెండు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ట్రిపుల్ ధమాకా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో ఆ మూడవ సర్ ప్రైజ్ ఏమై ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ఆ మూడవ సర్ ప్రైజ్ ఏంటంటే.. ఆర్ఆర్ఆర్. అవును.. ఆర్ఆర్ఆర్ సినిమాను మే 20వ తారీఖున ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా స్ట్రీమింగ్ కు రెడీ చేశారు. ఇలా ఎన్టీఆర్ పుట్టిన‌రోజున అభిమానుల‌కు ట్రిపుల్ ధ‌మాకా అన్న‌మాట‌. మ‌రి.. థియేట‌ర్లో సంచ‌ల‌నం సృష్టించిన ఆర్ఆర్ఆర్ ఓటీటీలో ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్