Motkupalli Narsimhlu Praised Kcr Moving Forward Ambedkars Successor
బీజేపీ కార్యక్రమంలో నిన్న డప్పులు కొట్టేవారిలో ఒక్కరూ డప్పులు కొట్టేవారు లేరని మాజీమంత్రి మోత్కు పల్లి నర్సింహులు విమర్శించారు. దళితబంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణభవన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో మోత్కుపల్లి బిజెపి నేతల వైఖరిని ఎండగట్టారు. దళితబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా?, బీజేపీ నేతలకు సిగ్గు ఉందా? కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా అని ఆ పార్టీ నాయకత్వాన్ని అడిగారు.
బీజేపీ వల్లే కులవ్యవస్థ ముందుకు నడుస్తోందని, బీజేపీ నేతలకు బుద్ధి ఉందా? ఓట్ల కోసం గారడి వేషాలు మానుకోవాలని హితవు పలికారు. నా అనుభవంలో చాలామంది సిఎంలను చూసానని,కెసిఆర్ తరహాలో ఎవరు దళితుల కోసం ఆలోచించలేదన్నారు. దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బీజేపీ వైఖరిని ఖండిస్తున్నానని, దళితులకు అడ్డం వస్తే పడేసి తంతారు- బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా అరుస్తున్నారని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. కేసీఆర్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు సాగుతున్నారని, బండి సంజయ్ కి సిగ్గులేదా? నాతో వస్తవా హుజురాబాద్ పోదామన్నారు. బండి సంజయ్ పిచ్చి వెధవ- కేసీఆర్ దళితబంధు ఇస్తానని అంటుంటే వినిపించడం లేదా అన్నారు.
ఒక మనిషికి రూపాయి ఇవ్వాలంటే లక్ష షరతులు పెడతారని, ఎస్సి కార్పొరేషన్- స్పెషల్ ఫండ్ వల్ల ఉపయోగం లేదు- కానీ దళితబంధు వల్ల ఉపయోగం ఉందన్నారు. దళితబంధుకు అడ్డుపడితే ఊర్లలోకి రానివ్వకుండా తొక్కిపెడతారని హెచ్చరించారు. బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి వెళ్లి డప్పులు కొట్టాలి దళితబంధు పథకం కావాలని, బండి సంజయ్ దున్నాలనిపిస్తే ఒక ట్రాక్టర్ ఇస్తాం దున్నుపో అన్నారు.
కేసీఆర్ ను టచ్ చేస్తే బండి సంజయ్ మాడిమసై పోతాడని, మోడీ 15 లక్షలు ఇస్తాడని పేదలంతా ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారని మోత్కుపల్లి పేర్కొన్నారు. బీజేపీ ఇస్తానన్న 15లక్షలు ఇవ్వకపోను- కేసీఆర్ 10లక్షలు ఇస్తానంటే అడ్డం వస్తారా అన్నారు. దేశంలో ఎవ్వరికీ అక్కరరాని పార్టీ బీజేపీ అని దళితబంధు పథకం దేశమంతా బీజేపీ అమలు చెయ్యాలని టీఆరెస్ డిమాండ్ చేస్తోందన్నారు. మిలియన్ మార్చ్ ఎందుకు పెడుతున్నారు? 2కోట్ల ఉద్యోగాలు మోడీ ఇచ్చారనా?ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోను ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు.
పెట్రోల్- డీజిల్ ధరలు రోజువారిగా పెంచడానికి సిగ్గు అనిపించడం లేదా? 450 రూపాయలున్న గ్యాస్ ధరలు 1000కి పెరిగాయని, మోడీ చెప్పే అచ్చేదిన్ రావడం లేదు కాని సచ్చేదిన్ వచ్చిందని మోత్కుపల్లి ఆరోపించారు.
Also Read : బిజెపికి మోత్కుపల్లి రాం.. రాం…