నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజును గుంటూరు జిజిహేచ్ నుంచి జిల్లా జైలుకు తరలించారు. నేటి ఉదయం నుంచి రఘురామకు 18 రకాల వైద్య పరిక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య నివేదికను జిల్లా మేజిస్ట్రేట్ కు వైద్యుల కమిటి అందజేసింది.
కాసేపట్లో జిల్లా మేజిస్ట్రేట్ ఈ నివేదికను హైకోర్టు డివిజన్ బెంచ్ కు అందజేయనుంది. ఈ నివేదిక పరిశీలించిన తర్వాతా హైకోర్టు బెంచ్ ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనుంది. రఘురామ అనారోగ్యంతో బాధపడుతున్నారని, పోలీసులు ఆయన్ను గాయపరిచారని, మెరుగైన వైద్యం కోసం రమేష్ ఆస్పత్రికి తరలించాలని అయన తరపు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్ధించారు.
సామాజికవర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎంపీ రఘురామపై ఐ పి సి 124B సెక్షన్ కింద ఎపి సిఐడి అభియోగం మోపిన సంగతి తెలిసిందే.