Saturday, January 18, 2025
Homeసినిమాఆ మూవీని రీమేక్ చేయాల‌నుకుంటున్ననాగ్

ఆ మూవీని రీమేక్ చేయాల‌నుకుంటున్ననాగ్

ప్ర‌స్తుతం ట్రెండ్ మారినా.. ఓటీటీ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు రీమేక్ పై దృష్టిపెడుతుండ‌డం విశేషం. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీకి రీమేక్ నే ఎంచుకున్నారు. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రీ ఎంట్రీ మూవీని ‘వ‌కీల్ సాబ్’ అనే రీమేక్ తోనే చేశారు. ‘భీమ్లానాయ‌క్’ కూడా రీమేకే. చిరంజీవి ‘గాడ్ ఫాద‌ర్’, ‘భోళా శంక‌ర్’ కూడా రీమేక్ చిత్రాలే. వెంకీ ఇటీవ‌ల‌ ‘నార‌ప్ప‌’, ‘దృశ్యం 2’ అనే రీమేక్ చిత్రాలు చేశారు. ప్ర‌స్తుతం ఓరి దేవుడా అనే రీమేక్ చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు చిరంజీవి, వెంక‌టేష్ తో పాటు నాగార్జున కూడా ఓ రీమేక్ పై క‌న్నేశారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ.. ఆ రీమేక్ ఏంటంటే.. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన ‘మోనిస్ట‌ర్’. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం దీపావ‌ళికి విడుద‌ల కానుంది. ఈ సినిమా స‌క్సెస్ అయితే.. ఈ సినిమా రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకునేందుకు చిరు, నాగ్, వెంకీ రెడీగా ఉన్నార‌ట‌. దీంతో ఈ మూవీని ఎవ‌రు రీమేక్ చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

చిరు, వెంకీ.. రీమేక్ మూవీస్ ఎక్కువే చేశారు కానీ.. నాగార్జున మాత్రం రీమేక్ చిత్రాలు చేయ‌డం చాలా త‌క్కువ‌. ఇటీవ‌ల ది ఘోస్ట్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన స్థాయిలో మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ఎలాంటి క‌థ‌లు చేయాలి అనే విష‌యంలో నాగార్జున ఆలోచ‌న‌లో ప‌డ్డారు. మ‌రి.. మోనిస్ట‌ర్ రీమేక్ హ‌క్కుల‌ను నాగార్జున సొంతం చేసుకుంటారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్