Monday, February 24, 2025
Homeసినిమాబాలయ్యకు కరోనా!

బాలయ్యకు కరోనా!

Covid attack: సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. గత రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని,  అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని బాలకృష్ణ కోరారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. త్వరలోనే సాధారణ కార్యకలాపాలలో పాల్గొంటానన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఈ నెల 21న యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ, 22న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 22 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఛైర్మన్ హోదాలో పాల్గొన్నారు. దీనిలో మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్