భద్రాద్రి కొత్తగూడెం- ములుగు – మహబూబాబాద్ భూపాలపల్లి జిల్లాల అధికారులతో ఈ రోజు డిజిపి మహేందర్ రెడ్డి , ఇంటిలిజెన్సీ ఐజి ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మావోయిస్టులు చాలా మంది అజ్ఞాతంలో ఉన్నారు. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ లో 20 మంది లో 11 మంది తెలంగాణకు చెందిన వారున్నారు. గోదావరి తీర ప్రాంతంలో ఇటీవల మావోల కదలికలు పెరిగాయని, నిరంతరం కూంబింగ్ నిర్వహించాలన్నారు. జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారికి అవకాశం ఇవ్వాలని డిజిపి సూచించారు.
మొత్తం మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో దాదాపు 130 మంది తెలుగు వారు తెలంగాణ వారు ఉన్నారు .వారందరు కూడా సరెండర్ అవ్వాలని సూచించిన డిజిపి. మావోయిస్ట్ లుగా పనిచేస్తున్న వారి కుటుంబసభ్యులకు నా విన్నపం వారు జన జీవన శ్రవంతి లో కలవడానికి పోలీస్ శాఖ తరుపున కోరుకుంటున్నానని డిజిపి విజ్ఞప్తి చేశారు.
మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తెలంగాణ చేయడానికి తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో చేయడానికి యాంటీ మావోయిస్ట్ కమిటీ పని చేస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.