Saturday, January 18, 2025
HomeసినిమాChiranjeevi Nayanthara: మెగాస్టార్ ఫాంటసీ మూవీలో నయనతార?

Chiranjeevi Nayanthara: మెగాస్టార్ ఫాంటసీ మూవీలో నయనతార?

తమిళ సినిమాలతో నయనతార ఫుల్ బిజీ. ఒక వైపున లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే, మరో వైపున సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వెళుతోంది. రీసెంట్ గా ఆమె చేసిన ‘జవాన్’ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. నయనతార యాక్షన్ ను నేరుగా తమ సినిమాలో చూసిన బాలీవుడ్ మేకర్స్, ఆమెను తమ సినిమాల కోసం ఒప్పించడానికి గట్టిగానే ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి తాజా చిత్రం విషయంలో నయనతార పేరు తెరపైకి వచ్చింది.

చిరంజీవి 157వ సినిమాకి శ్రీవశిష్ఠ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే సినిమా .. భారీ వ్యయంతో కూడినది. ఫాంటసీ నేపథ్యం ఉన్నప్పటికీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయని అంటున్నారు. నాయిక పాత్ర వైపు నుంచి కూడా వెయిట్ ఎక్కువగా ఉంటుందట. ఈ తరహా పాత్రను నయనతార చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి మేకర్స్ వచ్చినట్టుగా టాక్. అందువలన నయనతారను సంప్రదిస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. దాదాపు ఆమె అంగీకరించవచ్చనే అంటున్నారు.

గతంలో చిరంజీవి సినిమా ‘సైరా’లో నయనతార నటించింది. అయితే ఆ సినిమాలో ఈ ఇద్దరి మధ్య ఎలాంటి రొమాన్స్ గానీ .. డ్యూయెట్లుగాని లేవు. ఆ కథ అలాంటిది గనుక, ప్రేక్షకులు కూడా సర్దుకుపోయారు. కానీ ఈ జోడీ నుంచి డ్యూయెట్లను మాస్ ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ ముచ్చట ఈ సినిమాతో తీరవచ్చని అంటున్నారు. ఈ సినిమాకి నయనతార ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాపైనే మెగా అభిమానులంతా దృష్టి పెట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్