Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్, కొరటాల మూవీ అసలు కథ ఇదేనా..?

ఎన్టీఆర్, కొరటాల మూవీ అసలు కథ ఇదేనా..?

ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత కొరటాల శివతో సినిమా చేస్తానని ప్రకటించారు. అయితే.. కొరటాల శివ.. చిరు, చరణ్ లతో తెరకెక్కించిన ‘ఆచార్య’ ఫ్లాప్ అవ్వడంతో మరింత జాగ్రత్తగా ఎన్టీఆర్ తో చేయాలి అనుకున్న కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడం వాయిదా వేస్తూనే ఉన్నారు. యంగ్ టైగర్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్, కొరటాల మూవీ సెట్స్ పైకి వెళుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తునే ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే.. అప్ డేట్ కావాలి అంటూ రోజూ పోస్టులు పెడుతూనే ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం.. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ ని ముగించి తారక్ – చరణ్ ఇప్పటికే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. తదుపరి తమ ప్రాజెక్టుల పై ఆ ఇద్దరూ దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా తారక్ వెంటనే కొరటాలతో సినిమాని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. స్క్రిప్టు అద్భుతంగా వచ్చిందని… నేటి ట్రెండ్ కి తగ్గ స్టోరీ ఇదని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కి పాన్ ఇండియా అప్పీల్ ఉన్న యూనివర్శల్ కథను వినిపించారని తెలిసింది. నవంబర్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే… నిజానికి విద్యార్థుల రాజకీయాల చుట్టూ కథను రాసుకున్నా ఇప్పుడు దాంతో సంబంధం లేకుండా మరో కొత్త కథను కొరటాల రాశారని తెలిసింది. ఈ కొత్త స్క్రిప్టు ప్రకారం.. ఇది గరుడ పురాణం ఆధారంగా రూపొందించిన కథతో తెరకెక్కనుంది. అంత్యక్రియల కర్మలు, పునర్జన్మలకు కారణమయ్యే మెటాఫిజిక్స్ వంటి అంశాలతో అనుసంధానించబడిన సమస్యలను తెర పై చూపిస్తారని సమాచారం. మరి.. ఈ మూవీతో ఎన్టీఆర్, కొరటాల ఎంత వరకు మెప్పిస్తారో..?  బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

Also Read : జాన్వీ మనసు దోచుకున్న స్టార్ హీరో..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్