Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాఫీకీ ఓ దినోత్సవం

కాఫీకీ ఓ దినోత్సవం

కాఫీ తాగుడు ఆరోగ్యానికి మంచిదని కొందరంటే అబ్బే అదెంత మాత్రమూ మంచిది కానే కాదని చెప్పేవారున్నారు. ఎవరెలా అంటేనేం నేనైతే పొద్దున్నే లేచి మా ఆవిడ కాఫీ కలిపివ్వాలని చూడక నాకు నేను కాఫీ తాగితే తప్ప రోజు ప్రారంభమవదు. అందులోనూ ఫిల్టర్ తీసిన డికాషన్లో అంత పాలు కలిపి వేడివేడిగా తాగితేతప్ప తాగినట్టుండదు.

మార్కెట్లో దొరికే ఇన్ స్టంట్ కాఫీకూడా నాకిష్టమే. ఆ రుచే రుచి. అయితే అంతకన్నా రుచికరమైంది కాఫీ చరిత్ర. కాఫీని ఏ క్యాటరింగగ్ చదివే విద్యార్థో కనిపెట్టలేదు. ఓ మేకల కాపరి తనకూ తెలీకుండా దీనిని కనిపెట్టాడు. దాన్నే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తాగుతున్నారు.

అతనొకరోజు తన మేకలు కాఫీ చెర్రీలను తినడం గమనించాడు. వాటిని తిన్న మేకల ప్రవర్తన రోజూకన్నా భిన్నంగా కనిపించింది. వాటిలో కొత్త శక్తిని గమనించాడు. రాత్రి నిద్దపోలేదు. వాటి తీరు గురించి స్థానిక సాధువులకు వివరించాడు. వారంతా విని తాముకూడా రాత్రంతా పడుకోకుండ ఎక్కువ దైవస్మరణతో గడపవచ్చనుకున్నారు. అనుకున్నదే తడవుగా వారు కాఫీ చెర్రీలతో పానీయం చేసి తాగడమే కాకుండా తమలో శక్తితోపాటు ఉత్సాహంతో గడిపారు. ఈ విషయం చుట్టుపక్కలవారికీ తెలియడంతో అందరూ కాఫీ చెర్రీలపై పడ్డారు. ఇలా కాఫీ పానీయం వాడుకలోకొచ్చింది.

కాఫీ కనిపెట్టి పన్నెండు శతాబ్దాలైంది. తొమ్మిదో శతాబ్దంలో ఇతియోపియాకు చెందిన ఓ మేకలకాపరి యాథృచ్ఛికంగా కనిపెట్టిన పానీయమే కాఫీ.

ప్రపంచ చరిత్రలో మూడుసార్లు కాఫీని నిషేధించారు. పదహారో శతాబ్దంలో మక్కాలోను, 1675లో ఐరోపాలో రెండవ ఛార్లెస్, 1677లో జర్మనీలో ఫ్రెడరిక్ అనే అతను కాఫీని నిషేధించారు. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ వంటి దేశాలలో కాఫీ తాగేవారెక్కువ.

కాఫీ చెట్లు ముప్పై అడుగుల ఎత్తు వరకూ ఎదుగుతాయి. కానీ అంత ఎత్తు రానివ్వకుండా చెట్టు నరికేస్తుంటారు. అంటే ఓ పదడుగుల ఎత్తు వరకూ ఎదగనిస్తారు  అప్పుడే సులభంగా కోయడానికి వీలవుతుందని వారి అభిప్రాయం.

కామరూన్లో ఉండే ఓ రకమైన కాఫీ  (Coffea Charrieriana)యే ప్రపంచంలో ప్రకృతిసిద్ధంగా కాఫైన్ లేని స్వచ్ఛమైన కాఫీ లభిస్తుందట.1906లో ఇంగ్లీష్ వాడైన జార్జ్ కాన్ స్టంట్ వాషింగ్టన్ అనే అతను మొట్టమొదటిసారి ఇన్ స్టంట్ కాఫీని తయారుచేశారు. 

కొన్ని దేశాలలోని కొన్ని ప్రదేశాలలో కాఫీ గింజలను ఎరువుగానూ ఉపయోగిస్తారు.

ప్రపంచంలోని కొన్ని కాఫీ రకాలు… Espresso Macchiato, Cappuccino, Cafe Latte, Mocha chino, America-no, Irish coffee, Indian Filter coffee, Turkish coffee, White coffee.అరబ్ దేశాలలో కాఫీ తయారీ విధానం కాస్త విచిత్రంగా ఉంటుంది. గ్రౌండ్ కాఫీ బీన్స్, పాలు, జంతువుల కొవ్వు సహాయంతో, అరబ్బులు బంతులను తయారు చేసి రోడ్డుపై అలసటను తగ్గించారు. మొదటి కాఫీ షాప్ తెరిచిన ఒట్టోమన్ సామ్రాజ్యం ద్వారానే కాఫీ ఐరోపాకు చేరుకుంది.

రష్యాలో  పీటర్ – I తో ఈ పానీయం ముడిపడి ఉంది. అతను తన సహచరులను “చేదు స్విల్” ఉపయోగించమని బలవంతం చేశాడు. కేథరీన్ ది గ్రేట్ నమ్మశక్యం కాని కాఫీ తాగింది.

18 వ శతాబ్దం నుండి, అనేక ఉష్ణమండల దేశాలలో కాఫీ చెట్టు పెంచడం మొదలైంది. ప్రపంచ ఉత్పత్తిలో సగం కంటే తక్కువ బ్రెజిల్ వాటా ఉంది. పారిశ్రామిక స్థాయిలో, రెండు రకాల కాఫీ చెట్లను మాత్రమే పండిస్తారు – అరబికా, రోబస్టా. కాఫీ అరబికానే అత్యధికంగా ప్రపంచంలో 90 శాతం కాఫీ మొక్కలు సాగవుతున్నాయి.

కాంగో కాఫీ లేదా రోబస్టా వ్యాధి నిరోధకత కలది. దిగుబడి తక్కువ. ఖర్చుతో కూడిన ఉత్పత్తి. ఈ విషయంలో, రోబస్టా అరబికా కంటే గణనీయంగా ఉన్నతమైనది. రోబస్టా వాసన గాఢంగా ఉంటుంది. ఇందులో రెట్టింపు కెఫిన్ ఉంటుంది, అందుకే దీనిని ఎస్ప్రెస్సో లేదా ఇన్ స్టంట్ కాఫీ మిశ్రమాలకు ఎక్కువగా కలుపుతారు.

జాకబ్స్ ఓ ప్రసిద్ధ కాఫీ బ్రాండ్.  దీని ఉత్పత్తులు రోబస్టా, అరబికా (జాకబ్స్ మోనార్క్) మిశ్రమం. ఈ సంస్థను 1895 లో జర్మన్ వ్యవస్థాపకుడు జోహన్ జాకబ్స్ స్థాపించాడు. బ్రెజిల్‌లో సముద్ర మట్టానికి కనీసం 600 మీటర్ల ఎత్తులో కాఫీ తోటలున్నాయి. బ్రెజిల్ తరువాత వియత్నాం కాఫీ సాగులో రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా కాఫీ పండిస్తారు.

అత్యంత ఖరీదైన కోపి లువాక్ అడవిలో నివసించే జంతువుల బిందువుల నుండి సేకరిస్తారు. ఆస్ట్రేలియా, ఆస్ట్రియా తదితర దేశాలలో  సెప్టెంబర్ 29వ తేదీన కాఫీ దినోత్సవం జరుపుకుంటాయి. స్విట్జర్లాండులో సెప్టెంబర్ 28ని కాఫీ దినోత్సవం. అయితే అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని అక్టోబర్ ఒకటో తేదీన జరుపుకుంటారు. ఇది 2015లో అధికారికంగా నమోదైంది.

1932 ఒలింపిక్స్ సమయంలో అనుకోని ఆర్థిక కొరతతో తమ అథ్లెట్లను పోటీలకు ఆతిథ్యమిచ్చే లాస్ ఏంజిల్స్ కు పంపలేని పరిస్థితి ఎదురైంది. అప్పుడు బ్రెజిల్ ప్రభుత్వం ఓ తీర్మానం చేసింది. ఓ నౌక నిండా కాఫీ గింజలు ఎక్కించి వాటిని అమ్మి డబ్బుని ఖర్చులకు ఉపయోగించుకోమన్నదే ఆ తీర్మానం.

సౌదీ అరేబియాలో ఓ సంస్కృతి వాడుకలో ఉంది. ఉదయం పూట తన భర్తగానీ తాజా రుచి గల కాఫీ తీసుకురాకుంటే దానినే కారణంగా చూపి భార్య అతని నుంచీ విడాకులు తీసుకోవచ్చని.

“Expresso” కాఫీలో ఎక్స్ ప్రెస్సో అనే పదం ఇటలీ భాషకు చెందినది. కాఫీ బీన్స్ ని పొదలలో సాగు చేస్తారు.నిజానికి ఇది బెర్రీలో ఓ రకం. ఇదొక పండు రకం. వాటిలో ప్రధానంగా రెండు రకాలుంటాయి. రెడ్ బీన్స్. గ్రీన్ బీన్స్. రెడ్ బీన్స్ సువాసనతో కూడినది. ఇందులో ఆమ్లం కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది.

ఎక్కువ సేపు ఈ గింజలను వేయిస్తే అవి ఆరోగ్యానికి అంత మంచివని అంటారు.సంగీత మేధావి బితోవాన్ పక్కా కాఫీ ప్రియుడు. ఈయన తెగ కాఫీ తాగేవాడు. ప్రపంచంలో దైన కాఫీ  “Kopi Luwak”. ఇండోనేషియాలో తయారు చేసే కాఫీ పానీయమిది.

అమెరికన్లు ఏడాదికి సగటున 1092 డాలర్లు కాఫీకి ఖర్చుపెడతారు.అంటే వారానికి ఇరవై డాలర్లు. ఇది దాదాపుగా ఓ కొత్త iPhone ధరంతన్న మాట. వృద్ధులకన్నా యువతరం కాఫీమీద ఎక్కువ ఖర్చు చేస్తున.నట్టు కొన్ని సర్వేలు తెలిపాయి.

అంతర్జాతీయ కాఫీ అసోసియేషన్ మేరకు అమెరికా కంటే ఐరోపా నుంచే ఎక్కువ కాఫీ దిగుమతి అవుతున్నాదట. అయినప్పటికీ బ్రెజిల్ నుంచే ఇప్పటికీ కాఫీ దిగుమతి అధికం.

కాఫీ తయారీలో నాలుగు ప్రధాన సంస్థలున్నాయి. వాటిని “Big Four” అంటారు. అవి – Kraft, P&G, Sara Lee and Nestle. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే కాఫీ రకాలలో యాభై శాతం వరకూ ఈ నాలుగు సంస్థలూ కొనుగోలు చేస్తుంటాయి.

– యామిజాల జగదీశ్

Also Read:

దా పోయి మా వచ్చె ఢామ్ ఢామ్ ఢామ్

Also Read:

నో బుక్

Also Read:

పండువెన్నెల్లో పడుకోవద్దు!

RELATED ARTICLES

Most Popular

న్యూస్