Sunday, January 19, 2025
Homeసినిమా‘పోకిరి’ మీట‌ర్ లో ‘స‌ర్కారు వారి పాట’ : మ‌హేష్ బాబు

‘పోకిరి’ మీట‌ర్ లో ‘స‌ర్కారు వారి పాట’ : మ‌హేష్ బాబు

Its like Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై ఈ చిత్రం రూపొందింది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ భారీ సినిమా కోసం కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ ఆల్ టైం రికార్డులు సృష్టించి సినిమాపై అంచనాలని మరింత పెంచింది. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే…

“సర్కారు వారి పాట క్రెడిట్ దర్శకుడు పరశురామ్ గారికి దక్కుతుంది. పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. చాలా ఎంజాయ్ చేసి పని చేశాను. పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి. బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతిదీ కొత్తగా వుంటుంది. మంచి కథలు ఎంపిక చేసుకోవడం. అనుభవం పెరగడం కారణంగా… గత నాలుగేళ్ళుగా అద్భుతంగా ఉంది. ‘సర్కారు వారి పాట’ కూడా విజయవంతమైన సినిమా అవుతుంది”

“సర్కారు వారి పాటలో క్యారెక్టర్ పోకిరి మీటర్ లో వుంటుంది. పోకిరి షేడ్స్ లో వున్న క్యారెక్టర్ మళ్ళీ దొరికింది. పోకిరి చూస్తే థియేటర్ లో ఒక మాస్ ఫీలింగ్ వుంటుంది. అలాంటి క్యారెక్టర్ మళ్ళీ సర్కారు వారి పాటతో కుదిరింది. కథ ఫస్ట్ హాఫ్ లో యుఎస్ లో మొదలై .. సెకండ్ హాఫ్ వైజాగ్ కి వస్తుంది. ఒక మాస్ సాంగ్ ఐతే బావుంటుందని టీం మొత్తం నిర్ణయానికి వచ్చాం. తమన్ ‘మ మా మహేష్’ పాట ట్యూన్ వినిపించారు. చాలా ఎనర్జీటిక్ గా అనిపించింది. పది రోజుల్లో ఒక భారీ సెట్ వేసి షూట్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. సర్కారు వారి పాటలో ఈ పాట ఒక హైలెట్ గా ఉండబోతుంది”

కీర్తి సురేష్ సినిమాలో ఇరగదీసింది.  ఆమె పాత్ర చాలా సర్ ప్రైజింగా వుంటుంది. లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. తమన్ మ్యూజికల్ సెన్సేషన్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.. కళావతి పాట నా కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది. ట్యూన్ ఇచ్చినపుడు ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ఐతే తమన్ బలంగా నమ్మాడు. ప్రతి పెళ్లిలో ఇదే పాట వినిపిస్తుందని చెప్పాడు. అదే జరిగింది. మిగతా పాటలు అద్భుతంగా వచ్చాయి. రీరికార్డింగ్ కూడా అదరగొట్టాడు.”

“నెక్ట్స్ త్రివిక్ర‌మ్ గారితో సినిమా చేస్తున్నాను. ఆ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది. మా కాంబినేషన్ అంటేనే డిఫరెంట్ లెవల్ వుంటుంది. ఆయన అద్భుతమైన రచయిత. ఆయన రాసిన డైలాగ్ నేను పలుకుతుంటే ఆ కిక్కే వేరు. ఆయన సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచుస్తున్నా. త్రివిక్ర‌మ్ గారితో సినిమా త‌ర్వాత రాజ‌మౌళి గారితో సినిమా ఉంటుంది” అంటూ విశేషాలు తెలియజేశారు.

Also Read : 

కళ్లావీ! కురులావీ!

RELATED ARTICLES

Most Popular

న్యూస్