Wednesday, May 8, 2024
HomeTrending Newsపత్తిపాక మోహన్‌ కు కెసిఆర్ అభినందనలు

పత్తిపాక మోహన్‌ కు కెసిఆర్ అభినందనలు

కేంద్ర సాహిత్య అకాడమీ, ‘బాలసాహిత్య పురస్కారా(2022)నికి’ డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ ఎంపికవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కడం గొప్ప విషయమని సిఎం అన్నారు. గాంధీజీ పై రాసిన బాల సాహిత్యానికి గాను తెలంగాణ సాహితీవేత్తకు ఈ అవార్డు దక్కడం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు.

కీర్తి శేషులు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి శిష్యుడైన, సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన, పత్తిపాక మోహన్.. సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్