Monday, February 24, 2025
HomeTrending NewsBoat Shrinking: వారణాసిలో నిడదవోలు వాసులకు తప్పిన ప్రమాదం

Boat Shrinking: వారణాసిలో నిడదవోలు వాసులకు తప్పిన ప్రమాదం

వారణాసిలోని గంగానదిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిడదవోలు వాసులు ప్రాణాలతో బయటపడ్డారు. నిడదవోలుకు చెందిన 120 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం వారణాసి చేరుకున్నారు. గంగానదిలో పిండ ప్రదానాలు చేయాలని భావించిన 40 మంది పడవలో నది దాటుతుండగా కొంతదూరం వెళ్లాక పడవకు చిల్లు పడింది. అది చూసిన అందులోని వారు భయంతో కేకలు వేశారు.

దీంతో బోటును వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్ ప్రయత్నిస్తున్న సమయంలో వారంతా భయంతో అటూఇటూ కదలడంతో అదుపుతప్పిన బోటు బోల్తాపడింది. నదిలో పడిన వారు ఆర్తనాదాలు చేయడంతో సమీపంలో ఉన్న మిగతా బోట్ల వారు వెంటనే అక్కడికి చేరుకుని మునిగిపోయిన 40 మందిని రక్షించారు. మరోవైపు, విషయం తెలిసిన వారణాసి కలెక్టర్, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, యాత్రికులు వారణాసి నుంచి నిడదవోలుకు తిరుగు పయనమయ్యారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్