Sunday, November 24, 2024
Homeసినిమా'ఆహా'లో బాలయ్య, ప్రభాస్ ముచ్చట్లు ఎప్పుడు?

‘ఆహా’లో బాలయ్య, ప్రభాస్ ముచ్చట్లు ఎప్పుడు?

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో  ఫస్ట్ సీజన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో సెకండ్ సీజన్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడుతో సెకండ్ సీజన్ స్టార్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ లో పలు ఆసక్తికరమైన ప్రశ్నలు బాలయ్య అడగడం.. దీనికి చంద్రబాబు ఇంట్రస్టింగ్  సమాధానాలు చెప్పారు. ఇక అక్కడ నుంచి ఎవరెవరు గెస్టులు గా రానున్నారనే వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్స్ సురేష్‌ బాబు, అల్లు అరవింద్, స్టార్ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి ఈ టాక్ షోకు రావడం విశేషం.

అయితే.. గత కొన్ని రోజులు నుంచి ఈ టాక్ షోకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రానున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదేదో గాసిప్ అనుకున్నారు. ఆ తర్వాత ఇది నిజమే అని తెలిసింది.  ప్రభాస్ చాలా తక్కువ మాట్లాడతాడు. చాలా సిగ్గు ఎక్కువ. అలాంటి ప్రభాస్ తో బాలయ్య ఏం మాట్లాడిస్తారు..?  ఎలాంటి ప్రశ్నలు వేస్తారు..?  దీనికి ప్రభాస్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆదిపురుష్‌, సలార్, తన పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు బాలయ్య ఖచ్చితంగా అడుగుతారని దీనికి ఏం చెబుతారో అని అభిమానులు ఇప్పటి నుంచే ఈ క్రేజీ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ ఎపిసోడ్ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ప్రభాస్ తో బాలయ్య చేసే టాక్ షో ఎపిసోడ్ షూట్ ఈ డిసెంబర్ 11న జరగనుందని తెలిసింది. ఆరోజు బాలయ్య మరియు ప్రభాస్ లు ఫేస్ టు ఫేస్ అవ్వనున్నారని చెప్పాలి. మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ ఫ్రెండ్ మన టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కూడా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి.. దీని పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే  ఈ ఎపిసోడ్ ప్రసారం ఎప్పుడు అనేది క్లారిటీ రావాల్సివుంది. మరి.. ఈ ఎపిసోడ్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుని ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్