Sunday, September 22, 2024
Homeసినిమాప్రభాస్ అభిమానులకు పండగే

ప్రభాస్ అభిమానులకు పండగే

ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా రూపొందిన మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ రిలీజ్ చేసిన తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో అంచనాలు తగ్గాయి కానీ.. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం అంచనాలు పెరిగాయి. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. జూన్ 16న వరల్డ్ వైడ్ గా ఆదిపురుష్ మూవీ భారీ స్థాయిలో విడుదల కానుంది.

అయితే.. ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ మూవీతో పాటు సలార్ టీజర్ రిలీజ్ చేయండి.. అని ఓ సలహా ఇచ్చారు. ఈ సలహా కాస్త డిమాండ్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానుల డిమాండ్ వైరల్ అయ్యింది కానీ.. సలార్ మేకర్స్ నుంచి కానీ.. ప్రభాస్ నుంచి కానీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆదిపురుష్ మూవీతో పాటు అభిమానులు కోరుకున్నట్టుగా సలార్ టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆదిపురుష్ రిలీజ్ అవుతుందా..? సలార్ టీజర్ చూస్తామా..? అని వెయిట్ చేస్తున్నారు.

సలార్ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు సాధించడం ఖాయం అనే టాక్ వినిపస్తుంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఉన్నాయి. ఏది ఏమైనా.. ప్రచారంలో ఉన్నట్టుగా ఆదిపురుష్ మూవీతో పాటు సలార్ టీజర్ రిలీజ్ చేస్తే.. అభిమానులకు పండగే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్