Sunday, January 19, 2025
HomeTrending Newsఅన్నా-చెల్లెల పార్టీ కాంగ్రెస్ - జేపీ న‌డ్డా

అన్నా-చెల్లెల పార్టీ కాంగ్రెస్ – జేపీ న‌డ్డా

Regional Parties : భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్  జాతీయ పార్టీ కాద‌ని విమర్శించారు. వార‌స‌త్వ రాజ‌కీయాలు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. అన్నా-చెల్లెల పార్టీగా మారిందంటూ ఈ రోజు ఆరోపించారు. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పాలనకు కుటుంబ పార్టీల ముప్పు అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌లో పాల్గొన్న జేపీ నడ్డా.. సిద్ధాంతాలు లేకపోవడం, ఒకే వ్యక్తి ఆసక్తికి అనుగుణంగా పార్టీ నడవడం ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ వ్యాఖ్యానించారు.

జేపీ న‌డ్డా త‌న‌ ప్ర‌సంగంలో కాంగ్రెస్ పై ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు.   కాంగ్రెస్ జాతీయ పార్టీ కాదు, భారతీయత లేదు.. ప్రజాస్వామ్యమూ లేదు’ అని విమ‌ర్శించారు.  వంశపారంపర్య రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్‌పై మండిప‌డ్డారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో నడ్డా మాట్లాడుతూ, “కాంగ్రెస్ ఇప్పుడు జాతీయ పార్టీ కాదు, భారతీయ మరియు ప్రజాస్వామ్య పార్టీ కాదు. వంశ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ ఇప్పుడు అన్నా-చెల్లెల్ల‌ పార్టీగా మారిపోయింద‌ని” ఆరోపించారు. జేపీ న‌డ్డా ప్రాంతీయ పార్టీల‌పై కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ప్రాంతీయ‌ పార్టీలు భావజాలం లేనివిగా ఉంటాయ‌నీ, అధికారం కోసం మాత్రమే ఏర్పడతాయంటూ పేర్కొన్నారు. “మొదట్లో, వారు భావజాలం గురించి మాట్లాడతారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధాంతం పక్కకు పెట్టి, రాజవంశ రాజకీయాల వైపు మొగ్గు చూపుతుంది” అని జేపీ న‌డ్డా అన్నారు.

‘‘అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ఇతర పార్టీల తీరును ఉదాహ‌రిస్తూ.. బీజేపీ ఎవరితో పోరాడుతుందో మీరే చూస్తారని అన్నారు. ‘‘జమ్మూ కాశ్మీర్‌లో పీడీపీతో పోరాడుతున్నాం. పంజాబ్‌లో సిరోమణి అకాలీదళ్ ఎలా నడుస్తోంది? ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో పోరాడుతున్నాం. ప్రజాస్వామ్యానికి పెను ముప్పు పొంచి ఉందని మీకు అర్థమైంది! మేము బీహార్‌లో లాలూ జీతో, బెంగాల్‌లో దీదీ మరియు ఆమె మేనల్లుడితో పోరాడుతున్నాం. ఈ పార్టీలకు ‘నా కోరికలు, నా పాలన’ అనే విధంగా ముందుకు సాగుతున్నాయ‌ని నడ్డా అన్నారు.

వంశపారంపర్య రాజకీయాల గురించి నడ్డా మాట్లాడుతూ, “బాబూజీ వృద్ధుడైన తర్వాత, కొడుకు పార్టీని తీసుకున్నాడు. ఒరిస్సాలో బిజూ జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, తెలంగాణలో టీఆర్ఎస్‌, తమిళనాడులో కరుణానిధి కుటుంబం, మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి అన్నీ కుటుంబ రాజకీయ పార్టీలే. లాలూజీకి వృద్ధాప్యం వచ్చాక ఆయన కుమారుడు బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలో ఎన్సీపీలో కూడా అదే పరిస్థితి ఉంది అని అన్నారు. ఈ పార్టీల ప్రయోజనం ఏమిటి? వారికి భావజాలం లేదు. వారి లక్ష్యం అధికారం. ఈ పార్టీలన్నీ మొదట ప్రాంతీయ పార్టీలుగా వచ్చాయి. ఇందులో కూడా కాంగ్రెస్‌దే బాధ్యత. వారు ప్రాంతీయ ప్రయోజనాలను పట్టించుకోలేదు. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను పక్కన పెడితే ప్రాంతీయ పార్టీల్లోని వ్యక్తులు పార్టీని ఆక్రమించారు అని కాంగ్రెస్ ను విమ‌ర్శించారు.

Also Read : సంస్కరణల దిశగా కాంగ్రెస్..సోనియా దిశానిర్దేశం

RELATED ARTICLES

Most Popular

న్యూస్