Saturday, July 27, 2024
HomeTrending Newsమల్లారెడ్డి భూములపై విచారణకు డిమాండ్

మల్లారెడ్డి భూములపై విచారణకు డిమాండ్

మంత్రి మల్లారెడ్డి సగం జోకర్.. సగం బ్రోకర్… అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. భూములు అమ్మిన కొన్నా.. మల్లారెడ్డికి మాములు ఇవ్వాలంట, జవహర్ నగర్లో తప్పుడు పేపర్ లు క్రియేట్ చేసి మల్లారెడ్డి హాస్పిటల్  నిర్మించాడని ఆరోపించారు. సూరారం లో చెరువును కబ్జా చేసి హాస్పిటల్ కట్టిండన్న రేవంత్ ఇట్లా సర్కార్ భూములు కబ్జా చేసి హాస్పిటల్స్, కాలేజీలు కట్టిండని ఆరోపించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ కి అనుమతి వచ్చిన భూమి కూడా దొంగ భూమేనని, గుండ్ల పోచంపల్లి లో మల్లారెడ్డి బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి.. తప్పుడు పత్రాలు చూపించి కబ్జా చేసిండన్నారు. మల్లారెడ్డి భూములపై విచారణకు ఆదేశించు.. కేసీఆర్.. అది తప్పు అని తేలితే నేను ఏ శిక్ష కైనా సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

సీఎం కేసీఆర్ మూడు చింతలపల్లిని దత్తత తీసుకునే సమయంలో మస్తు హామీలు ఇచ్చిండని, మూడు చింతల పల్లి, లక్ష్మాపూర్, కేశవపూర్ గ్రామాల గురించి ఏం చెప్పిండో అందరికి తెలుసని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వీరా రెడ్డిని ఆదర్శంగా తీసుకొని హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పాడని విమర్శించారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల గిరిజన, దళిత ఆత్మగౌరవ దీక్ష జరుగుతోంది. ఇందులో భాగంగా రెండో రోజు రేవంత్ రెడ్డి సిఎం కెసిఆర్ పాలనపై నిప్పులు చెరిగారు.

కరెంట్, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పిన కెసిఆర్ మాట తప్పాడని భూముల సమస్యలు పరిష్కరిస్తా అని మరిన్ని సమస్యలు సృష్టించాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చించడానికి ఇవ్వాళ సాయంత్రం లోగా రావాలని సవాల్ విసిరిన.. ఎవ్వరు రాలేదన్నారు.

మూడు చింతలపల్లి లో ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన ఇండ్లే వున్నాయ్, కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళడానికే  రోడ్డు పెద్దగా చేసిండని రేవంత్ రెడ్డి అన్నారు. రోడ్డు పైకి చేయడంతో ఇండ్లు కిందికైనయ్. వాన కాలంలో వాన నీళ్లు ఇండ్లలోకి వస్తున్నాయని దళిత వాడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊరిలో ఇంతవరకు కమ్యూనిటీ హల్ కూడా కట్టలేదని, దత్తత తీసుకున్న గ్రామంలో ఒక్క పని చెయ్యాలె అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్