మహిళల ఆసియా కప్ టి 2022 టోర్నమెంట్ లో లో ఇండియా శుభారంభం చేసింది. ఆరంభ మ్యాచ్ లో శ్రీలంకపై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఈ టోర్నమెంట్ కు బంగాదేశ్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. సిల్హెట్ లోని ఔటర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 23 పరుగులకే ఇండియా ఓపెనర్లు ఇద్దరూ (షఫాలీ వర్మ-10; స్మృతి మందానా-6) ఔటయ్యారు. ఈ దశలో రోడ్రిగ్యూస్-కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లు మూడో వికెట్ కు 92 పరుగులు జోడించారు. హర్మన్ 33; రోడ్రిగ్యూస్ -76(53 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత హేమలత 13 చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
లంక బౌలర్లలో రణసింఘే మూడు; సుగందికా కుమారి, కెప్టెన్ ఆటపట్టు చెరో వికెట్ పడగొట్టారు.
శ్రీలంక బ్యాట్స్ మెన్ లో ఓపెనర్ హర్షిత మాధవి-26; హాసిని పెరీరా-30; రణసింఘే-11 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.
ఇండియా బౌలర్లలో హేమలత మూడు; పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు; రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
రోడ్రిగ్యూస్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : Asia Cup Cricket (Women): 15 మందితో ఇండియా జట్టు