Sunday, September 8, 2024
HomeసినిమాNC23: లవ్ స్టోరీ కాంబో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?

NC23: లవ్ స్టోరీ కాంబో మ్యాజిక్ రిపీట్ చేసేనా..?

చైతూ – చందూ కలిసి ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలు చేశారు. ఇందులో ప్రేమమ్ సక్సెస్ కాగా, సవ్యసాచి ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు మూడవసారి ఇద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో చైతూకు జంటగా నటించే హీరోయిన్ ఎవరు..? అని గత కొన్ని రోజులుగా సస్పెన్స్ గా ఉంది. సాయిపల్లవి లేదా కీర్తి సురేష్ నటించనున్నట్టుగా ప్రచారం జరిగింది.

అయితే.. ఇప్పుడు మేకర్స్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఈ మూవీ ప్లాన్ ఏంటి అనేది చందు మొండేటి వివరిస్తున్నారు. అలాగే ఈ వీడియోలో హీరోయిన్ ఎవరు అనేది కూడా హింట్ ఇచ్చారు. ఇంతకీ ఎవరు అనేది క్లారిటీ చూపించలేదు కానీ.. సాయిపల్లవి అనిపిస్తుంది. చైతన్య, సాయిపల్లవి కలిసి లవ్ స్టోరీ మూవీలో నటించడం ఆ సినిమా సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ ఏర్పడింది. అక్టోబర్ నెలాఖరు నుంచి లేదా నవంబర్ నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

యధార్థ సంఘటనలు ఆధారంగా రూపొందే ఈ కథలో చాలా డెప్త్ ఉందని.. అందరికీ కనెక్ట్ అయ్యేలా చందు తెరకెక్కించడానికి పక్కా ప్లాన్ రెడీ చేశాడని సమాచారం. ఈ చిత్రాన్ని దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. మరి.. ఈ మూవీతో చైతూ – సాయిపల్లవి కలిసి మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్